జాతీయ వార్తలు

తప్పుకుంటున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగలూరు, మే 19: కర్నాటకలోని మూడు రోజుల యెడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలింది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామంటూ చివరి క్షణం వరకూ ధీమా వ్యక్తం చేసిన యెడ్యూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే నిష్క్రమించారు. అసెంబ్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, భావోద్వేగంతో ప్రసంగించిన అనంతరం ‘నేను రాజీనామా చేస్తున్నాను ..’ అంటూ సభ నుండి వెళ్లిపోయారు. గత మూడు రోజులుగా అనేక మలుపులు తిరిగిన కర్నాటక రాజకీయం యెడ్యూరప్ప రాజీనామాతో సరికొత్త బాట పట్టింది. కాంగ్రెస్ మద్దతుతో మెజార్టీ సీట్లను సంతరించుకున్న జేడీ(ఎస్) ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జేడీ(ఎస్) అధినేత హెడ్‌డి కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. దీంతో ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ మరో పక్క అత్యున్నత న్యాయవ్యవస్థలోనూ విస్తృత స్థాయి తర్జన భర్జనలకు దారితీసిన కర్నాటక రాజకీయం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్టయింది. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశించినట్టే యెడ్యూరప్ప విశ్వాస పరీక్షను అంతిమ ఫలితంతో నిమిత్తం లేకుండా ఎదుర్కొంటారని ప్రతి ఒక్కరూ ఆశించారు. అయితే మెజార్టీ లేకపోవడం పరీక్షను ఎదుర్కొంటే ఓటమి తథ్యమన్న వాస్తవం కళ్లకు కట్టడంతో భావోద్వేగ ప్రసంగంతోనే యెడ్యూరప్ప సభ నుంచి
నిష్క్రమించి గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా సమర్పించారు. ‘ నేను విశ్వాస పరీక్షను ఎదుర్కోను, రాజీనామా చేస్తాను..’ అంటూ ప్రసంగం ముగింపులో యెడ్యురప్ప పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు తిరగకుండానే ఆయన పదవీకాలంతో దీంతో ముగిసింది. అయితే తుది శ్వాస విడిచే వరకూ రైతుల కోసం పాటుపడతానని, తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేస్తానంటూ ప్రసంగంలో ఆయన భావోద్వేగాన్ని పండించారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వాజుభాయ్ వాలాను కలుసుకుని రాజీనామా అందజేశారు. ఎపుడైతే బలనిరూపణకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును సుప్రీంకోర్టు శనివారం సాయంత్రానికే కుదించిందో , ఏ విధంగానూ అవసరమైన బలాన్ని సమీకరించుకునే అవకాశం యెడ్యురప్పకు లేకుండా పోయింది. అంతకుముందు రెండు సార్లు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం మొదటిసారి ఏడు రోజుల్లో, రెండోసారి మూడేళ్లలో ముగిసింది. యెడ్యురప్ప ప్రసంగం హృద్యంగా సాగింది. ఒక దశలో ఆయన కంటితడి పెట్టారు. ఒకపుడు తమకు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉండేవారని, వారి సంఖ్య ఇపుడు 104కు పెరిగిందని పేర్కొన్న ఆయన అందుకోసం తాను పడ్డ కష్టాన్ని , శ్రమను గుర్తుచేసుకున్నారు. తన జీవితం అంతా అగ్నిపరీక్ష చందంగానే సాగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎలాంటి వెతలకు వెరవక యావజ్జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని గద్గద స్వరంతో యెడ్యురప్ప అన్నారు.
యెడ్యురప్ప రాజీనామా అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ , జెడిఎస్‌లు మంతనాలు జరిపాయి. నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్న జెడిఎస్ అధినేత కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ తమ కూటమిని ఆహ్వానించారని, సోమవారం కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. మెజార్టీ నిరూపణకు గవర్నర్ తనకు 15 రోజుల పాటు గడువు ఇచ్చినా, సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ విశ్వాసాన్ని చూరగొంటామని కుమారస్వామి స్పష్టం చేశారు. కర్నాటక వ్యవహారంలో సరైన ఆదేశాలను జారీ చేసినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీ బలపరీక్షకు హాజరైన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ కూడా ఉన్నారు. మెజార్టీ కోసం బీజేపీ అడ్డదార్లు తొక్కి ఎమ్మెల్యేలను వశం చేసుకోకుండా బలపరీక్ష గడువు కుదించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం తన చర్య ద్వారా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని పరిరక్షించిందని వాటి ప్రాధాన్యతను పునరుద్ధరించిందని ఇంతకు ముందు ప్రోటం స్పీకర్ కేజీ బోపయ్య విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయనను తొలగించాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టులో పట్టుపట్టలేదు. ఎపుడైతే పారదర్శకత కోసం విశ్వాసపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందో, బోపయ్య తొలగింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. శనివారం ఉదయం నుండే పరీక్షను ఎదుర్కోకుండానే యెడ్యురప్ప రాజీనామా చేసే వరకూ కర్నాటక రాజకీయం యావద్దేశాన్ని ఆకర్షించింది. మెజార్టీ తనదేనంటున్న యెడ్యురప్ప ఏం చేయబోతున్నారో తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జెడిఎస్ కూటమి ఏ రకమైన ఎత్తులు వేస్తుందన్నదానిపై అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగింది.