జాతీయ వార్తలు

గుజరాత్‌లో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, మే 19: కూలి కోసం హైవే ఎక్కిన బతుకులు సిమెంట్ బస్తాల కింద ఛిద్రమైపోయాయి. చీకట్లు చెదరక ముందే కూలి బతుకులు తెల్లారిపోయాయి. శనివారం తెల్లవారుఝామున గుజరాత్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం ముగ్గురు పిల్లలు సహా 19మందిని చిదిమేసింది. ప్రమాదం సంభవించిన సమయంలో సమీప ప్రాంతంలో జనావాసాలు లేకపోవడంతో రక్షించేవారులేక ఆర్తనాదాలు చేస్తూనే కూలీలు ప్రాణాలు విడిచారు. సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రక్ ధొలేరా సమీపంలోని భావలియాలో బోల్తాపడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్ భావ్‌నగర్ జిల్లా పిపావావ్ పోర్టు నుంచి వస్తున్నట్టు సమాచారం. ట్రక్‌పై 25మంది కూలీలున్నారు. ఉదయం వేళ ప్రమాదం చోటు చేసుకోవడంతో సమీప ప్రాంతాల్లో కనీసం రక్షించేవాళ్లు లేక ఎక్కువ ప్రాణ నష్టం సంభవించినట్టు చెబుతున్నారు. కూలీలు సిమెంట్ బస్తాల కింద పడి నలిగిపోయారని అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారీ వెల్లడించారు. మృతుల్లో 12 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులున్నట్టు ఆయన తెలిపారు. 18 మంది సంఘటనా స్థలంలోనే చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. గాయపడ్డ ఆరుగుర్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడం వల్లే దారుణం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. గుజరాత్ రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్-్భవనగర్ హైవేపై జరిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

చిత్రం..సిమెంట్ బస్తాల కింద చిక్కుకున్న కూలీలను క్రేన్ల సాయంతో వెలికి తీస్తున్న రెస్క్యూ సిబ్బంది