జాతీయ వార్తలు

మోదీ.. ఓ నియంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ప్రధాని మోదీ ఓ నియంత. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు అనుమతించటం ద్వారా తన అవినీతిని బైటపెట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నాటక సీఎం యెడ్యూరప్ప శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోలేక రాజీనామా చేసిన నేపథ్యంలో రాహుల్ ఏఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుమతి మేరకే యెడ్యూరప్ప తమ పార్టీ శాసనసభ్యులు, జేడీ(ఎస్) శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక నియంత. మోదీ, బీజేపీ, ఆరెస్సెస్ కలిసి దేశంలోని ప్రతి వ్యవస్థనూ సర్వనాశనం చేస్తున్నారన్నారు. కర్నాటక శాసనసభలో జాతీయ గీతాలాపన జరుగుతుంటే ప్రొటెం స్పీకర్, బీజేపీ శాసన సభ్యులు బైటికి వెళ్లిపోయారు. ఇదీ వారి దేశభక్తికి నిదర్శనమని దెప్పిపొడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ ఏ సంస్థనూ గౌరవించరు. అధికారం తలకెక్కినందుకే వారిలా చేస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. గోవా, మణిపూర్ ప్రజలిచ్చిన తీర్పును అగౌరపరిచారు. అయితే ఇప్పుడు కర్నాటక ప్రజలిచ్చిన తీర్పును అగౌరపరిచేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టగలిగామన్నారు. భారత దేశంలో డబ్బు, అధికారం, అవినీతి సర్వస్వం కాదు, ప్రజల తీర్పే సర్వస్వమని ఉద్ఘాటించారు. కర్నాటక ఎన్నికల్లో
బీజేపీ కంటే కాంగ్రెస్, జేడీ(ఎస్)కు ఎక్కువ ఓట్లు లభించాయన్నారు. నరేంద్ర మోదీ కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు అనుమతించటం సిగ్గు చేటన్నారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానంటూ నరేంద్ర మోదీ చేసే ప్రకటనలు పూర్తిగా అబద్ధం. నరేంద్ర మోదీ అవినీతికి ప్రతీక అని రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిని కర్నాటక ప్రజలు నిలువరించారన్నారు. ప్రధాన మంత్రి దేశం కంటే పెద్దవాడు కాదు. దేశ ప్రజలు, సుప్రీం కోర్టు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులకంటే పెద్దవాడు కాదు. తాను అందరికంటే, అన్నిటికంటే గొప్పవాడినని భావించటాన్ని మోదీ మానుకోవాలని రాహుల్ హితవు పలికారు. నరేంద్ర మోదీని దేశానికి నాయకత్వం వహించేందుకు ఎన్నుకున్నారు. దేశం, దేశ ప్రజలను గౌరవించాలనేది మోదీ అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనే విశ్వాసం తనకు లేదని వ్యంగ్యంగా అన్నారు. నరేంద్ర మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారు, బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఇతర నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. తాము కర్నాటక ప్రజల గొంతును రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కర్నాటకతోపాటు మొత్తం దేశ ప్రజల మనోభావాలను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నాటక గవర్నర్ వాజుభాయ్ వాలా రాజీనామా చేసినా ఆయన స్థానంలో వచ్చే గవర్నర్ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తాడు. వారు బీజేపీ, ఆరెస్సెస్ చెప్పినట్లు చేయాలి కదా? అని రాహుల్ ఎద్దేవా చేశారు.

చిత్రం..మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ