జాతీయ వార్తలు

సరిహద్దుల్లో ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మే 19: అంతర్జాతీయ సరిహద్దులో (ఐబీ) ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందు రోజు అంటే శుక్రవారం పాక్ రేంజర్ల కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాన్‌తోపాటు ఐదుగురు మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ ప్రాంతంలోని సరిహద్దుల్లో శనివారం ప్రశాంత వాతావరణం కనిపించింది. కాల్పులు జరిగిన ప్రాంతంలో విద్యాసంస్థలకు ముందు జాగ్రత్తగా సెలవులు ప్రకటించినట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూ, కథువా, సాంబ జిల్లాలో శుక్రవారం రాత్రి స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి, మొత్తం మీద పరిస్థితి ప్రశాంతంగానే ఉందని వారన్నారు. గత కొద్ది రోజులుగా సరిహద్దులో ఉన్న పరిస్థితితో పోల్చుకుంటే అంతా అదుపులోనే ఉందని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సాంబ జిల్లాలోని అఖ్నూర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఆవలివైపునుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయని ఆయన అన్నారు. రెండ్రోజుల క్రితం సరిహద్దులో పాక్ రేంజర్లు జరిపిన మోర్టల్ దాడుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాను, నలుగురు పౌరులు మరణించారు. 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అవుట్‌పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఇంత పెద్దఎత్తున పాక్ రేంజర్లు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ లెహ్ జిల్లాలోని లడఖ్ ప్రాంతాన్ని సందర్శించారు. శ్రీనగర్‌లో విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ఆయన లడఖ్ వచ్చారు. మే 15న సాంబ సెక్టార్‌లో పాక్ రేంజర్లు రెండుసార్లు కాల్పులకు పాల్పడగా బీఎస్‌ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఓ జవాను మరణించాడు. మర్నాడే ఐదుగురు ఉగ్రవాదులు కథువాలోని హీరానగర్ వైపువెళ్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అలాగే ఆర్‌ఎస్ పుర, బిష్ణా, ఆర్నియా సెక్టార్‌లో కాల్పుల ఘటనలతో 50 కుటుంబాలను తరలించినట్టు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అరుణ్ మన్హాస్ వెల్లడించారు. వారందరికీ వివిధ శిబిరాల్లో ఆశ్రయం కల్పించామన్నారు. జమ్మూకాశ్మీర్‌లో పాకిస్తాన్ రేంజర్లు ఎంత పెద్ద ఎత్తున మోర్టల్ దాడులకు దిగడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటి సారి. ఎల్‌ఓసి వద్ద 700 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోపాటు 38 మంది మరణానికి కారణమయ్యారు.