జాతీయ వార్తలు

కాశ్మీర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెహ్, మే 19: జమ్మూకాశ్మీర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఒకరోజు పర్యటనకు వచ్చిన ఆయన 25 వేల కోట్లతో నిర్మిస్తున్న ఆసియాలోనే అతిపెద్దదైన జోజిలా సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లెహ్‌లో జరిగిన కుషోక్ బాకులా రింపోచ్ 19వ జయంతి ఉత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సొరంగమార్గం ఈ ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు కలపడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున శ్రీనగర్-కార్గిల్-లెహ్ ప్రాంతాలను కలుపుతూ జాతీయరహదారిపై నిర్మిస్తారని చెప్పారు. శీతాకాలంలో తీవ్రంగా కురిసే మంచు వల్ల ఈ రహదారిని మూసివేసేవారని, దీంతో లడక్, కాశ్మీర్‌ల మధ్య సంబంధాలు తెగిపోయేవని, ఇప్పుడా అవసరం లేకుండా జోజిలా సొరంగ మార్గం పూర్తయితే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఉదయం మంత్రులు నితిన్ గడ్కరీ, జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలతో ఇక్కడకు వచ్చిన ప్రధాని మోదీ కుషోక్ బాకులా రింపోచ్‌కు నివాళి అర్పించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక భాషలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన మోదీ పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు.