జాతీయ వార్తలు

ఆ తీర్పు ఆశనిపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: భారతీయ జనతాపార్టీ (బీజేపీ) నాయకులు సుప్రీం కోర్టుపై మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు వల్లే యెడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకే శనివారం యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు అర్ధరాత్రి వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు అప్పటికప్పుడే విచారణ జరిపి బలపరీక్ష సమయాన్ని 15 రోజుల నుంచి 24 గంటలకు తగ్గించింది. సుప్రీం కోర్టు బలపరీక్ష సమయాన్ని 24 గంటలకు తగ్గించటం వల్లే బలనిరూపణ ఏర్పాట్లను చేయలేకపోయామని బీజేపీ నేతలు వాపోతున్నారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం బల నిరూపణకు కనీసం ఏడు రోజుల సమయం ఇచ్చినా ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదని వారంటున్నారు. అప్పుడు కచ్చితంగా బలనిరూపణ చేసుకుని ఉండేవాళ్లనని వారు అభిప్రాయపడ్డారు. కోర్టు నిర్ణయంతో తామేమీ చేయలేకపోయామన్న బాధ కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీలోకి ఫిరాయించాలనుకున్న ఎమ్మెల్యేలు ఎవరో తేల్చుకోలేకపోయామని వారు తెలిపారు. ఒక విధంగా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు తమను గందరగోళంలో పడేసిందని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఐదారు రోజుల సమయం కేటాయించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వారు పేర్కొన్నారు. ఒక విధంగా కోర్టు తీర్పు చూశాక ఆశలు వదలుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్, పార్టీ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే హుటాహుటిన బెంగళూరు వెళ్లిపోయి వ్యవహారాన్ని నడిపారని అన్నారు. తమ ఎమ్మెల్యేలను కట్టుదిట్టం చేశారన్నారు. సుప్రీం కోర్టు కచ్చితమైన విధానాన్ని అవలంబించటం తమ రాజకీయాన్ని దెబ్బతీసిందని బీజేపీ నాయకులు అంగీకరిస్తున్నారు.