జాతీయ వార్తలు

అలాంటి పరీక్షే.. అదే భావోద్వేగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: అందినట్టే అందిన అధికారం చేజారడం అన్నది ఆశనీపాతమే! ముఖ్యంగా అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అనివార్య పరిస్థితుల్లో తప్పుకోవల్సి రావడం అన్నది ఏ నాయకుడిలోనైనా భావోద్వేగాలను రగిలిస్తుంది. ఇందుకు హోదాలతో నిమిత్తం లేదు. ఎంతటి నాయకుడైనా స్వాభావికంగా ఓ సాధారణ వ్యక్తే. భారత రాజకీయ చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి..ఎన్నో చారిత్రక ఉదంతాలూ ఉన్నాయి. వాటిని భేరీజు వేసుకున్నప్పడు అనేక దృష్టాంతాలు కళ్లకు కడతాయి. తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి పదవికికి మూడు రోజులు తిరగకుండానే బీఎస్ యెడ్యూరప్ప రాజీనామా చేయడం 1996 నాటి అప్పటి ప్రధాని వాజపేయి రాజీనామా ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది. అప్పట్లో వాజపేయి రాజీనామాకు దారితీసిన పరిస్థితులకు శనివారం యెడ్యూరప్ప తప్పుకోడానికి అనివార్యంగా మారిన పరిస్థితులకు మధ్య ఎంతో సారూప్యత ఉంది. నాటు వాజపేయి లోక్‌సభలో భావోద్వేగ రీతిలో ప్రసంగించారు. రాజకీయ నైతిక విలువలను కళ్లకు కట్టారు. తన రాజకీయ జీవితాన్ని దేశ రాజకీయాల్లో మమేకమైన తన వ్యక్తిత్వాన్ని కూడా ఆ సందర్భంగా వాజపేయి భావోద్వేగ రీతిలో విశదీకరించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 13 రోజుల్లోనే వాజపేయి బలనిరూపణ పరీక్షను ఎదుర్కోవల్సి వచ్చింది. ఈ పరీక్షను ఎదుర్కోవడానికి ముందు అద్భుతమైన తన వాక్‌చాతుర్యానికి భావోద్వేగాన్ని మిళితం చేసి జాతి జనులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి పరిస్థితుల్లో పీవీ నర్సింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్‌కు 140 సీట్లు వచ్చాయి. బీజేపీ 161 సీట్లు గెలుచుకుంది. అయితే మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనతాదళ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ రాజకీయ చాతుర్యం పుణ్యమాని వాజపేయి స్థానే హెచ్‌డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు. రాజీనామాకు ముందు వాజపేయి చేసిన ప్రసంగం ఇది. ‘మేం గెలుచుకున్న సీట్లు అదృష్టం కొద్దీ వచ్చినవి కావు. జనంలో మెమేకమయ్యాం. వారి కోసం పనిచేశాం. మా సందేశాన్ని వారికి అందించాం. కానీ మరికొన్ని సీట్లు రాలేదు కాబట్టి మా నిజాయితీని నిరూపించుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మా బలహీనతేనన్న విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే రాష్టప్రతి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందుకు కారణం మాది లోక్‌సభలో అతిపెద్ద పార్టీ కావడమే. ఆ అవకాశాన్ని మేం వినియోగించుకున్నాం. పదవి పోయినా మాకేం దిగులు లేదు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కూర్చోడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ సజావుగా సాగాలంటే ప్రతిపక్ష పార్టీ మద్దతు ప్రభుత్వానికి ఎంతైనా అవసరం. ఆ విషయాన్ని మరిచిపోవడానికి వీల్లేదు. అయినా కూడా సభను సజావుగా సాగే విషయంలో మద్దతు ఇస్తాం. అయితే ఒక్క విషయం మీకు అధికారం కావాలి.హోదాతో నిమిత్తం లేకుండా ప్రజలు సంక్షేమం కోసం పనిచేయడం మాకు కావాలి. ఈ విషయంలో మేం ఏ విధంగానూ వెనుదిరిగేది లేదు. రాష్టప్రతికి నా రాజీనామా అందించేందుకు వెళ్తున్నాను...’ అంటూ వాజపేయి తన ప్రసంగాన్ని ముగించారు. నాటి పరిణామాలే అచ్చుగుద్దినట్టుగా శనివారం కర్నాటక అసెంబ్లీలోనూ పునరావృతం అయ్యాయి. రాజీనామాకు ముందు యెడ్యూరప్ప కూడా భావోద్వేగత రీతిలో మాట్లాడారు. కన్నీటి పర్యంతమయ్యారు కూడా. ‘అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలు మిగతా పార్టీలకంటే బీజేపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. అందుకు ప్రజలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. 104 సీట్లకు బదులు 113 సీట్లు మాకు అందించి ఉంటే రాష్ట్రాన్ని స్వర్గసౌధంగా మార్చి ఉండేవాణ్ని. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తాను. అంతేకాదు రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుంది. నా రాజీమానా లేఖ అందించడానికి రాజ్‌భవన్‌కు వెళ్తున్నాను’ అంటూ యెడ్యూరప్ప తన ప్రసంగాన్ని ముగించారు.

చిత్రం..అసెంబ్లీలో ప్రసంగానికి ముందు యెడ్యూరప్ప హావభావాలు