జాతీయ వార్తలు

వెలిగిపోతున్న భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ప్రపంచంలో ఆరో సంపన్న దేశంగా భారత్ అవతరించింది. కాగా యుఎస్ తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచంలో సంపన్న దేశాలపై ఆఫ్రోఆసియా బ్యాంక్ ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 62,584 బిలియన్ యుఎస్ డాలర్లతో యుఎస్ ప్రపంచంలోనే సంపన్న దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇక 24,803 బిలియన్ యుఎస్ డాలర్లతో చైనా రెండోస్థానాన్ని, 19,522 బిలియన్ డాలర్లతో జపాన్ మూడోస్థానాన్ని ఆక్రమించాయి.
ఒక దేశంలోని మొత్తం ప్రైవేటు వ్యక్తుల సంపదను, ఆ దేశ మొత్తం సంపదగా నివేదిక పేర్కొంది. వ్యక్తుల ఆస్తులు, నగదు, ఈక్విటీలు, వాణిజ్యపరమైన ఆస్తులు వంటివానికి ఈ గణనలో పరిగణలోకి తీసుకుంది. అయితే వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులు ఉన్నట్లయితే వాటిని మొత్తం ఆస్తుల్లోనుంచి మినహాయించి నికర ఆస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం గమనార్హం.
తొలి పదిస్థానాల్లోని సంపన్న దేశాలు వరుసగా యుకె (9,919 బిలియన్ యుఎస్ డాలర్లు), జర్మనీ (9,660 బిలియన్ యుఎస్ డాలర్లు), భారత్ (8,230 బిలియన్ యుఎస్ డాలర్లు), ఆస్ట్రేలియా (6,142 యుఎస్ బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (6,649 యుఎస్ బిలియన్ డాలర్లు), ఇటలీ (4,276 బిలియన్ యుఎస్ డాలర్లు).
పెద్ద సంఖ్యలో ఎంటర్‌ప్రెన్యూర్స్, ఉత్తమ విద్యావ్యవస్థ, బలీయమైన స్థాయిలో ఐటీరంగం, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, మీడియా రంగాలు గత దశాబ్ద కాలంలో భారత్‌లో 200 శాతం అభివృద్ధి చెందడమే దేశంలో సంపద పోగుపడటానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. వచ్చే దశాబ్దకాలంలో అంటే 2027 నాటికి చైనా మొత్తం 66,449 యుఎస్ డాలర్లతో మరింత బలీయమైన స్థానానికి చేరుకుంటుందని పేర్కొంది. ఇదే కాలంలో యుఎప్ సంపద 75,101 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అంచనా వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు రంగంలో ఉన్న మొత్తం ఆస్తి విలువ 215 ట్రిలియన్ యుఎస్ డాలర్లు కాగా 15.2 మిలియన్ హెచ్‌ఎన్‌డబ్ల్యుఐలు ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క నికర ఆస్తి విలువ 1 మిలియన్ యుఎస్‌డీ లేదా అంతకంటె ఎక్కువ ఉన్నదని పేర్కొంది.
నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 584,000 మంది మల్టీ మిలియనీర్లున్నారు. వీరిలో ఒక్కొక్కరి నికర ఆస్తి విలువ 10 మిలియన్ యుఎస్‌డి లేదా అంతకంటే ఎక్కువ. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2,252 మంది బిలియనీర్లలో ఒక్కొక్కరి ఆస్తి విలువ 1బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ. ఇదిలావుండగా రాబోయే పదేళ్లకాలంలో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ కెనడాను అధిగమించే అవకాశముంది. ఇదే సమయంలో జర్మనీ, యుకెలు కూడా గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తాయి. ఇక భారత్ జర్మనీ, యుకెలను అధిగమించి 2027 నాటికి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నివేదిక అంచనా వేసింది.
ప్రపంచ సంపద 2027 నాటికి 50 శాతం వృద్ధిని నమోదు చేసి, 321 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని నివేదిక అంచనా వేసింది. శ్రీలంక, భారత్, వియత్నాం, చైనా, మారిషస్ మార్కెట్లు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది.