జాతీయ వార్తలు

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఆరోపించారు. జయదేవ్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని 2014 డిసెంబరులోనే సెయిల్ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాత విషయాలను ఇప్పుడెందుకు ఎందుకు ప్రస్తవించిందని ఆయన ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను టాస్క్ఫోర్స్ పరిశీలిస్తోందని ఈ రోజు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసిందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యకాదని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. విభజన హామీలలో పెండింగ్‌లో ఉన్న అంశాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధానికి ఇచ్చిన లేఖలలో 12 అంశాలు ప్రస్తావించారని, అందులో స్టీల్ ప్లాంట్ కూడా ఉందని, కాని ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల అంశాలు ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ఏ నమ్మకంతో కన్నా లక్ష్మీనారాయణ కడపకు ఉక్కు పరిశ్రమ తెస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టాడానికే కేంద్రం ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రకటన చేసిందని ఆరోపించారు.