జాతీయ వార్తలు

నాలుగు నిమిషాలు కేటాయించలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: నాలుగు రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అతని మంత్రివర్గ సహచరులు ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నా వారికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ నాలుగు నిముషాలైనా కేటాయించలేరా? అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మెలో ఉన్న ఐఏఎస్‌లతో సమ్మె విరమించి విధులకు హాజరయ్యేలా చూడాలని, రేషన్‌ను డోర్‌డెలివరీ చేయాలని తదితర డిమాండ్లతో సీఎం కేజ్రీవాల్, మంత్రులు మనీష్ సిసోడియా, గోపాల్ రాయ్, సత్యేందర్ జైన్ సోమవారం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వీరిలో సిసోడియా, సత్యేందర్ జైన్ ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగారు. ఆప్ నేతల నిరసన గురువారం నాలుగోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సంజయ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలుసుకోవడానికి తనతోసహా ఎవరినీ అనుమతించ లేదని, అసలు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఐఏఎస్‌ల సమ్మెతో రాష్ట్రంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమ్మె ఆపడానికి చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నా చలనం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్వులు, లెఫ్టినెంట్ గవర్నర్ సహకారంతోనే ఐఏఎస్‌ల సమ్మె కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. నాలుగు రోజులుగా సీఎం సహా ముగ్గురు మం త్రులు ఆందోళన చేస్తున్నా వారికోసం నాలుగు నిముషాలు కేటాయించడానికి గవర్నర్‌కు సమ యం లేదా అని ఆయన ప్రశ్నించారు. సీఎంని కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించడం లేదని, ఆయనను గృహనిర్బంధంలో ఉంచారా లేదా అన్న ది ఢిల్లీ పోలీసులు స్పష్టం చేయాలని డి మాండ్ చేశారు. ఐఏఎస్ అధికారుల సమ్మె విషయంలో ఫిర్యాదు చేయడానికి తాము రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి రాజనాథ్ సింగ్ అపాయింమెంట్ కోరుతున్నామని సంజయ్ సింగ్ తెలిపారు. ఇలావుండగా, తాము ఎలాంటి సమ్మె చేయడం లేదని, రాష్ట్రంలో ఎలాంటి పని పెండింగ్‌లో లేదని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
మోదీజీ జోక్యం చేసుకోండి
ఐఏఎస్ అధికారుల సమ్మె విషయంలో జోక్యం చేసుకుని విరమించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసారు. సమస్య పరిష్కారానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఐఏఎస్‌ల సమ్మెతో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందని, మంత్రులతో జరిగే సమావేశాలకు గత మూడు నెలల నుంచి ఐఏఎస్ అధికారులు హాజరు కావడం లేదని అన్నారు. ముఖ్యంగా వాయుకాలుష్యం లాంటి ప్రధాన సమస్యపై చర్చించకపోవడంతో సమస్య తీవ్రమవుతోందని చెప్పారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం కనీసం తన సోదరుడిని కూడా తనను కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలావుండగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మంత్రులు మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌లకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు తమ ఆందోళన విరమించేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కేజ్రీవాల్ నివాసంలో చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్‌పై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినప్పటి నుంచి ఐఏఎస్ అధికారులు అనధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాకుండా తమ నిరసన తెలుపుతున్నారు.
చిత్రాలు..లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న ఆప్ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్
*కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో వెనుదిరుగుతున్న కేజ్రీవాల్, సత్యేందర్ కుటుంబీకులు
*ఢిల్లీ ప్రభుత్వ పరిణామాలపై గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ