జాతీయ వార్తలు

అభివృద్ధితోనే హింసకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిలాయ్ (చత్తీస్‌గఢ్), జూన్ 14: అభివృద్ధి, సంక్షేమం ద్వారానే హింసామార్గంలో వెళ్లేవారికి బదులివ్వాలని, శాంతి భద్రతలు నియంత్రించడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బస్తర్ ప్రాంతమంటే బాంబులు, తుపాకులు గుర్తుకు వచ్చేవని, ఈ రోజు విమాన సర్వీసులు కూడా ప్రారంభించామని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ రూ.22 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. జగదల్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. అనతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు. ప్రజల విశ్వాసం చూరగొన్నప్పుడు అభివృద్ధి పనులు వేగవంతమవుతాయన్నారు. నక్సలైట్లకు గుండెకాయలాంటి చత్తీస్‌గఢ్‌లో వచ్చే ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హింసామారాన్ని ఎన్నుకున్న వాళ్లకు అభివృద్ధి ద్వారా బదులివ్వాలని, కుట్రపూరితంగా వ్యవహరించేవారికి అభివృద్ధి సమాధానమని ఆయన చెప్పారు. అభివృద్ధి వల్లహింసను నివారించవచ్చన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, దీనిపైన వచ్చే ఆదాయాన్ని స్థానిక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా రూ.3వేల కోట్ల నిధులు ఇచ్చామన్నారు. ఈ నిధులతో ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్లు, మరుగుదొడ్లను నిర్మించామన్నారు. వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఇతోధికంగా ఆదాయ వనరులు పెంచేందుకు అన్ని చర్యలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమిష్టిగా తీసుకుంటున్నాయన్నారు. దేశంలో చిన్న నగరాలు, పట్టణాల మద్య ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలో మారుమూల ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో రాయ్‌పూర్ విమానానికి రోజుకు ఆరువిమాన సర్వీసులు వచ్చేవని, ఇప్పుడు 50 సర్వీసులకు పెంచామన్నారు. రాష్ట్రాన్ని యుపిఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఐఐటి కావాలని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చాలా సార్లు కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. భిలాయ్‌లో ఐఐటిని ఏర్పాటుచేశామన్నారు. చత్తీస్‌గఢ్ అంటే గతంలో అడవులు గుర్తుకువచ్చేవని, కాని ఈరోజు ఉత్తమమైన స్మార్ట్ సిటీ గుర్తుకు వస్తుందన్నరు. నయారాయ్‌పూర్ నగర నిర్మాణాన్ని ఆయన ప్రశంసించారు. దేశంలోతొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రాయ్‌పూర్ అవతరిస్తోందన్నారు. నయా రాయ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన మోదీ, దేశంలోని స్మార్ట్ సిటీలకు ఈ సెంటర్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రమణ్ సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు, శాంతి సాధనకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు.
చిత్రం..గురువారం భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ