జాతీయ వార్తలు

పాత పేపర్ల కట్టలో 2వేల ఆధార్ కార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 14: ఒక తుక్కు వ్యాపారి వద్దకు అమ్మకానికి వచ్చిన పాతపేపర్లు ఉన్న సంచిలోని కట్టలో రెండు వేల ఆధార్ కార్డులు బయటపడ్డాయి. జైపూర్‌లోని జలపుర ప్రాంతానికి చెందిన తుక్కువ్యాపారి ఇమ్రాన్‌కు ఎవరో పాత పేపర్లను అమ్మారు. ఆ పేపర్లను సరిచేస్తుండగా అందులోంచి రెండు వేల ఆధార్ కార్డులు కనిపించాయి. దీంతో విస్మయం చెందిన ఆయన వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు, ఐటి అండ్ కమ్యూనికేషన్ శాఖకు తెలియజేశాడు. స్థానిక పోలీస్ అధికారి లిక్‌మా రామ్ వచ్చి ఆధార్ కార్డులను పరిశీలించారు. బహుశా ఇవి పోస్ట్ఫాస్‌కు స్థానికంగా డెలివరీ నిమిత్తం వచ్చి ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. పొరపాటున ఆధార్‌కార్డుల పార్సిల్‌ను పాతపేపర్లలో కలిపేసి ఉండవచ్చునని చెప్పారు. ఈ విషయాన్ని తపాల శాఖ అధికారులకు సైతం తెలియజేశామని, ఆధార్‌కార్డులు పాతపేపర్ కట్టలోకి ఎలా వచ్చాయనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి చెప్పారు.