జాతీయ వార్తలు

ఉత్తరప్రదేశ్‌పై పగబట్టిన ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 14: ఉత్తరప్రదేశ్‌పై ప్రకృతి పగబట్టింది. ప్రచండ గాలులు, భారీ వర్షాలకు దుమ్మూదూళి తోడై బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల వర్షానికి 15 మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని అధికారి ప్రతినిధి గురువారం వెల్లడించారు. సీతాపూర్‌లో ఆరుగురు, గోండా, కౌశాంబిలో ముగ్గురేసి, ఫైజాబాద్, హార్డోయ్, చిత్రకూట్‌లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. సీతాపూర్‌లో 17 మంది, ఫైజాబాద్‌లో 11 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో ఇసుక తుపాన్లు విరుచుకుపడే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజులూ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. తాజాగా 17 మంది మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా తుపాన్లు మరిన్ని వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క ఆగ్రాలో అత్యధికంగా గురువారం 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోత్రలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇసుక తుపాన్లకు గత నెలలో 130 మంది మరణించారు. మే 13న ఒక్కరోజే 39 మంది మృతి చెందారు. బరేలీ, బారాబంకీ, బులంద్‌సహార్, లఖీంపూర్ ఖేరీ జిల్లాల్లో ప్రకృతి విలయం సృష్టించింది. అలాగే మే 9న తీవ్రమైన ఇసుక తుపానుకు 18 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు.

చిత్రం..రాజస్థాన్‌లోని బికనీర్‌లో గురువారం కమ్మేసిన ధూళి