జాతీయ వార్తలు

మంచినీటి ప్రాజెక్టుల్లో ప్రజలకూ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలంటే ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం అవసరమని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. కేవలం ప్రభుత్వం, పాలనాపరమైన చొరవతోపాటు ప్రజలను మంచినీటి ప్రాజెక్టులు, సరఫరాలో భాగస్వామ్యం కల్పించాలన్నారు. గురువారం ఇక్కడ జాతీయ గ్రామీణ మంచినీటి ప్రాజెక్టు అమలుకు సంబంధించి జరిగిన రాష్ట్రాల మంచినీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సహకారం లేకుండా ఏ అభివృద్ధి పనీ సాధ్యం కాదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం వల్లే విజయం సాధించామన్నారు. మంచినీటి ప్రాజెక్టుల విషయంలో కేవలం ప్రభుత్వం, పాలనాపరమైన అనుమతుల వల్ల ఆశించిన లక్ష్యాన్ని సాధించలేమన్నారు. దేశంలోని 115 జిల్లాల్లో స్వజల్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో కేవలం 25 శాతం మాత్రమే మంచినీటి లభ్యత, సరఫరా జరుగుతోందన్నారు. జాతీయ సగటు కంటే నీటి లభ్యత ఈ జిల్లాల్లో తక్కువగా నమోదైందన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరాపై స్థానిక ప్రజలు పంచాయితీ కార్యాలయాల్లో శిక్షణ ఇవ్వాలని ఆమె సూచించారు. మంచినీటి ప్రాజెక్టుల్లో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ శాఖలు చురుకుగా పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామీణ మంచినీటి ప్రాజెక్టులకు ఇతోధికంగా నిధులు మంజూరు చేశామన్నారు. నీటి నిల్వ, ఇంకుడు గుంతలపై రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని ఆమె కోరారు.
చిత్రం..గురువారం ఢిల్లీలో జాతీయ గ్రామీణ మంచినీటి ప్రాజెక్టు అమలుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. చిత్రంలో నీతిఆయోగ్
ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ (ఎడమ), నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ (కుడి)