జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్, పీవోకేలో మానవ హక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, జూన్ 14: కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ వ్యవహారాలపై అంతర్జాతీయ విచారణ అవసరమని ఐక్యరాజ్యసమితి తొలిసారిగా ప్రకటించిన నివేదికలో పేర్కొంది. భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్, పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్ భూభాగంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనే అభియోగాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తోందని, శాంతిని కోరే కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తోందని, ఈ చట్టాలను రద్దు చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల నిఘా సంస్థ పేర్కొనడం గమనార్హం. గతంలో, ప్రస్తుతం కూడా కాశ్మీర్ మొత్తం భూభాగంలో మానవ హక్కుల ఉల్లంఘనలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని యుఎన్‌ఒ పేర్కొంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు తావులేకుండా చూడాలని, జవాబుదారీతనం ఉండాలని, దీనికి తగ్గట్టుగా రాజకీయ నాయకత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నివేదికలో ప్రస్తావించారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారని, వారికి ఎటువంటి మానవహక్కులు లేవని తెలిపారు. ఈ నివేదికలో భారత్‌లోని జమ్ముకాశ్మీర్‌లో 2016 నుంచి 2018 ఏప్రిల్ వరకు జరిగిన ఘటనలు, ఆజాద్ కాశ్మీర్‌లో సాధారణ మానవ హక్కులకు భంగం కలిగించే చర్యలు, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో 1980 నుంచి ఉన్న పరిస్థితి తదితర అంశాలు ఉన్నాయి. జమ్ముకాశ్మీర్‌లో అనేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సాయుధ సంస్థలను ప్రస్తావించారు. భారత సైన్యం చేతిలో హతమైన బుర్హాన్ వని, తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సాయుధ సంస్థలు పెద్దఎత్తున మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా పాల్పడుతున్న అరాచకాలు, కిడ్నాప్‌లు, పౌరుల హత్య, లైంగిక హింస అంశాలను కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌లో సాయుధ సంస్థలకు ఎటువంటి మద్దతు ఇవ్వడం లేదని చెబుతున్నా, అంతర్జాతీయ నిపుణులు నమ్మే పరిస్థితి మాత్రంలేదు. ఈ సంస్థలకు వాస్తవాధీన రేఖ ఆవల నుంచి పాక్ సైన్యం ఆయుధ సంపత్తిని సమకూర్చుతోందని నివేదికలో పేర్కొన్నారు. కాశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం 1990ను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని యుఎన్‌ఓ నివేదికలో పేర్కొంది.

జవాన్లపైకి రాళ్లు రువ్వుతున్న యువకులు (ఫైల్‌ఫొటో)