జాతీయ వార్తలు

తెలంగాణకు మీ వంతుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరందించే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు 20వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని నివాసంలో మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యాంశాలపై పది వినతిపత్రాలు సమర్పించారు. కేసీఆర్ విజ్ఞప్తులకు మోదీ సానుకూలంగా స్పందించినట్టు తెరాస వర్గాలు వెల్లడించాయి. దాదాపు గంటపాటు సాగిన భేటీలో విభజన చట్టం హామీలు, కాళేశ్వరం సహా వివిధ నీటి ప్రాజెక్టులు, హైకోర్టు ఏర్పాటు, రాష్టప్రతి ఉత్తర్వులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రైల్వే ప్రాజెక్టుల్లో వేగం పెంచటం, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటీఐఆర్‌కు నిధుల కేటాయింపు, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ స్కూళ్ల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 80 వేల కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టుతో 20 జిల్లాలోని 18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే కాకుండా, మంచినీరు, పారిశ్రామిక సంస్థల నీటి అవసరాలూ తీరుతాయని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 25వేల కోట్ల బడ్జెట్ కేటాయించటంతోపాటు, ఆర్థిక సంస్థల నుండి మరో 22 వేల కోట్లు రుణాల రూపంలో సేకరిస్తున్నట్టు మోదీకి వివరించారు. కాళేశ్వరం పనులు పూర్తికి మరో 20 వేల కోట్లు కేంద్రం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తరువాతా పాత జోనల్ వ్యవస్థ కొనసాగుతోందని, దీన్ని సవరించాలని మోదీని కోరారు. తెలంగాణలో పాలనా సౌలభ్యం,
ప్రజావసరాలు దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు గురించి వివరించారు. కొత్త జిల్లాలు, కొత్త జోన్లకు అనుగుణంగా రాష్టప్రతి ఉత్తర్వులు సవరించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో రైల్వే లైన్లు జాతీయ సగటుకన్నా తక్కువగా ఉన్నాయి కాబట్టి, తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని త్వరిత గతిన చేపట్టాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకు భూసేకరణ చేపట్టింది, కేంద్రం ఈ లైను నిర్మాణాన్ని ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిదని స్పష్టం చేశారు. భూసేకరణ ముగిసిన అక్కన్నపేట్- మెదక్ రైల్వే లైన్ నిర్మాణాన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం కోరారు. భద్రాచలం రోడ్- సత్తుపల్లి మధ్య కొత్త లైన్ నిర్మించాలన్నారు. కాజీపేట- విజయవాడ మధ్య విద్యుద్దీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం- మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్- నిర్మల్- ఆదిలాబాద్ మధ్య బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలన్నారు. సికింద్రాబాద్- మహబూబ్‌నగర్, సికింద్రాబాద్- జహీరాబాద్ లైన్లను డబుల్ లైన్‌గా మార్చాలని, హుజూరాబాద్ మీదుగా కాజీపేట- కరీంనగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే జరిపించాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్‌లో కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్ భూములు కేటాయించాలని మరోసారి మోదీని కోరారు. 44వ నంబర్ జాతీయ రహదారి, 1నంబర్ రాష్ట్ర రహదారి విస్తరణకు రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదిలీ చేయించాలన్నారు. రక్షణశాఖ తమ భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రెండు రహదారుల విస్తరణతో రాజధాని ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను కేటాయించాలన్నారు. కేంద్రం 2013లో కేటాయించిన ఐటీఐఆర్‌ను రద్దు చేయవద్దని, అలా చేస్తే కేంద్రంపై ప్రజల విశ్వసనీయత తగ్గుతుందన్నారు. కేంద్రం వెంటనే ఐటీటిఐఆర్‌కు నిధులు విడుదల చేయాలని కోరారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు భూమి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకూ జవహర్ నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమయ్యే భూమి, ఇతర వౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.
చిత్రం..ప్రధాని నరేంద్ర మోదీకి శాలువా కప్పి సత్కరిస్తున్న సీఎం కేసీఆర్