జాతీయ వార్తలు

సర్వం డిజిటల్ మయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: దేశంలోని మారుమూల గ్రామాలకు టెక్నాలజీని తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టెక్నాలజీ విస్తరణకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని శుక్రవారం ఆయన తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతిక ఫలాలు అందించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు, బిల్లులు చెల్లింపులు, తదితర సదుపాయాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీన్లో భాగంగానే దేశంలోని మూడు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ)ను పటిష్టం చేస్తున్నట్టు మోదీ వెల్లడించారు. సెంటర్లను డిజిటల్ సర్వీసులకు అనుసంధానం చేయడం ద్వారా ఉపాధి కల్పనకు ఆస్కారం ఏర్పడుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక ఫలాలు చేరాలన్న లక్ష్యంతో ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. సీఎస్‌సీలను బలోపేతం చేయడం ద్వారా గ్రామ స్థాయి నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేయవచ్చని ప్రధాని చెప్పారు. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలతో(వీఎల్‌ఈ) మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘మారుమూల గ్రామాలు, యువతను చేరుకోవడం కోసమే డిజిటల్ ఇండియాకు శ్రీకారం చుట్టాం’అని వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో సామాన్యుడి ముంగిటకు డిజిటల్ సేవలు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటుచూసినా డిజిటల్ మయం అవుతోందన్న మోదీ ‘డిజిటల్ సాధికారిత.. డిజిటల్ లిటరసీ’దిశగా నడుస్తోందన్నారు. డిజిటల్ ఇండియా అనుభవాల ను పలువురు లబ్ధిదారులు మోదీతో పంచుకున్నా రు. గౌతంబుద్ధనగర్‌కు చెందిన జితేందర్ సోలంకీ మాట్లాడుతూ ‘మా గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం డిజిటల్ ఇండియా పుణ్యమే. మా పిల్లలు ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయం కలిగింది’అన్నారు. వృద్ధులకు పెన్షన్ల సమస్యలు డిజిటల్ లిటరసీతో పరిష్కారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘్భమ్’యాప్ ద్వారా సులభమైన, సురక్షితమైన లావాదేవీలు నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.