జాతీయ వార్తలు

పొంచిఉన్న నీటి ఎద్దడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: వచ్చే కొద్ది సంవత్సరాలలో భారతదేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. మిలియన్ల ప్రజలు భవిష్యత్‌లో నీటిలభ్యత లేక తీవ్ర ఇబ్బందులు పడబోతున్నారు. నీతిఅయోగ్‌కు చెందిన కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ (సిడబ్ల్యుఎంఐ) ఈ మేరకు ప్రజలకు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాలలో 2020 నాటికి భూగర్భ జలాలు ఇంకిపోవచ్చునని, 2030 నాటికి మంచినీటికి డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 600 మిలియన్ల భారతీయులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి సంవత్సరం సురక్షిత నీరు లభించక రెండు లక్షల మంది మృతి చెందుతున్నారని పేర్కొంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా భూగర్భ జలాలపెంపు, ఇరిగేషన్, నీటి పథకాలపై దృష్టి, మంచినీటి పథకాల పునరుద్ధరణ తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలు దృష్టిసారించాలని పేర్కొంది. అయితే ఈ విషయంలో మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని, అయితే జనాభా అధికంగా ఉండే యూపీ, బిహార్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పరిస్థితులు దుర్బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయితే ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి వాటర్ ఇండెక్స్‌లో చాలా తేడా ఉందని పేర్కొంది.