జాతీయ వార్తలు

రైఫిల్‌మ్యాన్‌కు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 15: పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయన రైఫిల్‌మ్యాన్ ఔరంగజేబ్‌కు సైన్యం నివాళులర్పించింది. కాగా బండిపొరా జిల్లాలోని పనాజ్ అడవుల్లో జరిపిన సైనిక చర్యలో అసువులు బాసిన రైపిల్ మన్వీంద్ర సింగ్‌కు కూడా సైన్యం నివాళులర్పించింది. ‘ఈద్ సందర్భంగా పుల్వామా జిల్లాలోని తన స్వగ్రామం ‘గాసు’కు వెళుతుండగా మార్గ మధ్యంలో మిలిటెంట్లు ఔరంగజేబ్‌ను అపహరించి దారుణంగా హతమార్చారు’ అని అధికారి ఒకరు తెలిపారు. మిలిటెంట్ల కాల్పుల్లో మెడ, తల భాగంలో పెద్ద సంఖ్యలో గుండ్లు దూసుకెళ్లాయి. దగ్గరినుంచి కాల్పులు జరపడంతో తల ఛిద్రమైంది. 24 ఏళ్ల ఔరంగజేబ్ జమ్ము కశ్మీర్‌లోని, పూంచ్ సెక్టార్, సలాని గ్రామానికి చెందినవాడు. 2012లో సైన్యంలో చేరాడు. కాగా మరో రైఫిల్‌మన్ మన్వీంద్ర సింగ్ (30) 2008లో సైన్యంలో చేరాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగలోని కబిల్తా గ్రామానికి చెందినవాడు. వీరికి పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
మోదీకి ఔరంగజేబ్ తండ్రి అల్టిమేటం
తన కొడుకు ఉగ్రవాదుల చేతుల్లో హతమైన సంగతి తెలసుకొని ఔరంగజేబ్ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. ‘నా కొడుకు మరణానికి కారణమైన వారిని హతమార్చాలి. ఇందుకు నరేంద్ర మోదీకి 72 గంటల టైమ్ ఇస్తున్నా. లేకపోతే మేమే సరిహద్దుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది’ అన్నాడు. ఔరంగజేబ్ తండ్రి కూడా గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యాడు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందనుకున్నా. కానీ మరింత దుర్భరంగా తయారైంది. రాజకీయాలు పక్కన బెట్టి వేర్పాటు వాదుల్ని హతమార్చాలి. అప్పుడే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందన్నాడు.