జాతీయ వార్తలు

పాత పేపర్ల దుకాణంలో ‘ఆధార్’ ప్రత్యక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 15: పోస్టుమాన్ నిర్వాకం వల్ల 1830 ఆధార్ కార్డులు పాత పేపర్ల కొనే డీలర్ వద్దకు చేరాయి. రాజస్థాన్‌లోని జాలుపురలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సతీష్‌కుమార్ అనే పోస్టుమాన్ తనకు కేటాయించిన ఆధార్ కార్డులు సక్రమంగా డెలివరీ చేసేవాడుకాదు. గత ఏడాది జనవరి నుంచి బట్వాడా చేయాల్సిన కవర్లు, కార్డులు అతడి వద్దే పేరుకుపోయాయి. గురువారం ఓ పాతపేపర్లు కొనే దుకారణం వద్ద 1830 ఆధార్ కార్డులు బయటపడడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనిపై విచారణ జరపగా సతీష్‌కుమార్ నిర్వాకం బయటపడింది. మరో కేసులో పోస్టుమాన్ ఈనెల 6నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాడని జైపూర్ సీనియర్ పోస్టుమాస్టర్ జనరల్ రామావతార్ శర్మ వెల్లడించారు. డీలర్ వద్ద లభించిన ఆధార్ కార్డులను సంబంధిత చిరునామాదారులకు అందించే ఏర్పాట్లు చేసినట్టు శుక్రవారం తెలిపారు. పాత దినపత్రికలతో కలిపి ఆధార్ కార్డులు డీలర్‌కు విక్రయించినట్టు విచారణలో తేలింది. సతీష్‌కుమారే ఈ పనిచేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. జాలుపుర పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ లిఖ్మారామ్ మాట్లాడుతూ తాము స్వాధీనం చేసుకున్న ఆధార్‌కార్డులను పోస్టల్ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు.