జాతీయ వార్తలు

వెలుగు చూసిన దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందోరీ, మార్చి 27: మహారాష్టల్రో చందోరీ గ్రామం మీదుగా సాగుతున్న గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మూడు దశాబ్దాల తర్వాత పలు పురాతన దేవాలయాలు బయల్పడ్డాయి. నాసిక్‌కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ప్రస్తుతం మహారాష్టల్రోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అక్కడ గోదావరి పాయలు ఎండిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో పలు దేవాలయాలు బయల్పడ్డాయి. వీటిలో కొన్ని దేవాలయాలను 1982లో చందోరీ గ్రామస్థులు చూశారని, అప్పట్లో నాసిక్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడటంతో ఇవి బయల్పడాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక పేర్కొంది. అయితే ఎంతో పురాతనమైన ఈ దేవాలయాలకు సంబంధించి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) వద్ద ఎటువంటి రికార్డులు లేవని, బ్రిటిష్ యుగానికి పూర్వం నాసిక్ గెజిట్‌లో మాత్రమే ఈ దేవాలయాలు, ఘాట్ల ప్రస్తావన ఉందని ఆ పత్రిక వెల్లడించింది. కాగా, ప్రస్తుతం తన జీవితంలో తొలిసారి ఈ దేవాలయాలను చూశానని చందోరీ గ్రామ సర్పంచ్ సందీప్ తార్లే చెప్పారు. ‘గతంలో ఎప్పుడూ నీటితో గోదావరి కళకళలాడుతుండేది. దీంతో నీటిలో మునిగిపోయిన ఈ దేవాలయాలు ఎవరికీ కనిపించేవి కావు. వేసవి కాలంలో నీటి మట్టం తగ్గడంతో ఈ దేవాలయాల గోపురాలు, వాటి ప్రాకారాలు మాత్రమే స్వల్పంగా కనిపించేవి. కానీ ప్రస్తుతం నది పూర్తిగా ఎండిపోవడంతో జీవితంలో తొలిసారి ఈ దేవాలయాలను చూడగలుగుతున్నాం’ అని ఆయన వివరించాడు.