జాతీయ వార్తలు

ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 17: ఢిల్లీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి హామీ లభించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ అంశాన్ని నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆదివారం ఇక్కడ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డికుమారస్వామి ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సమావేశమై ఢిల్లీ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. అనంతరం మమతా బెనర్జీ విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరామన్నారు. కాని ప్రధాని మాత్రం ఈ అంశంపై నోరు మెదపలేదన్నారు. కాగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారన్నారు. మేము చేసేది చేశాం. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి వద్ద బైఠాయిస్తున్న ఘటనకు పశ్చిమబెంగాల్, కర్నాటక, ఏపి, కేరళలో పాలక పక్షాలు మద్దతు ఇచ్చాయి. ఈ సందర్భంగా వీరు కేజ్రీవాలాను శనివారం కలుసుకున్నారు. రాజకీయ సంక్షోభం వల్ల ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనరాదనే తమ అభిమతమని మమతా బెనర్జీ చెప్పారు.