జాతీయ వార్తలు

రైతు రుణమాఫీకి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే, ఇందుకు కేంద్రం సహకరించాలని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని, దీనిని అమలు చేసేందుకు ఖర్చయ్యే మొత్తంలో యాభై శాతాన్ని భరించాలని కేంద్రాన్ని కోరుతున్నామని మొదటిసారీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న కుమారస్వామి అన్నారు. సుమారు 85 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, వరుస కరవులు, పంట నష్టం వంటి కారణాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. వారికి సాయం అందించే దిశగా రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చాలన్న కృతనిశ్చయంతోనే తాను ఉన్నానని కుమారస్వామి తెలిపారు. జెడి (ఎస్) పార్టీ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు, మొట్టమొదటగా రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, సొంతంగా మెజారిటీ లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ సహకారంతో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత, ఈ విషయాన్ని మరచిపోయిందంటూ విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇటీవల విపక్ష పార్టీల ప్రతినిధులతోపాటు రైతు సంఘాల ప్రతినిధులు కూడా కుమారస్వామిని కలిసి రుణమాఫీపై నిలదీశారు. 15 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన వారికి హామీ ఇచ్చారు. ఆ గడువు ఈనెల 15వ తేదీతో ముగిసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రత్యేకంగా రుణమాఫీ విషయాన్ని ప్రస్తావించా. దీనిపై కసరత్తు జరుపుతున్నామని, దీర్ఘకాల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. చాలా త్వరలోనే రైతు రుణమాఫీపై ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పులు, భూగర్భ జలాలు ఇంకిపోవడం వంటి అనేకాకనేక కారణాలతో రైతులు భారీగా నష్టపోతున్నారని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేకపోతున్నారని కుమారస్వామి తెలిపారు. అందుకే, తక్షణమే రుణమాఫీ చేయడంతోపాటు, ఆధునిక వ్యవసాయ రీతులను అమలు చేసేందుకు కృషి జరగాలని అన్నారు. దేశంలో వ్యవసాయ విప్లవం అత్యవసరమని పేర్కొన్నారు. వైపరీత్యాలు సంభవించినప్పుడు, బాధితులను ఆదుకోవడానికి 2015-2020 మధ్యకాలానికి కేంద్రం తమకు 1,375 కోట్ల రూపాయలను కేటాయించిందని గుర్తుచేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటకకు దక్కింది చాలా తక్కువని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, రైతుల స్థితిగతులు తదితర అంశాలపై లోతైన చర్చలు జరగాలని, దీర్ఘకాల ప్రణాళికలను రూపొందించుకోవాలని కుమారస్వామి సూచించారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సగ భాగాన్ని కేంద్రం భరిస్తే తమకు భారం కొంతవరకైనా తగ్గుతుందని చెప్పారు.