జాతీయ వార్తలు

బీజేపీయేతర కూటమికి రాహుల్ నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 17: వచ్చే సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపిని మట్టికరిపించాలనే తాపత్రయం ఉంటే, దేశంలోని అన్ని బీజేపియేతర పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలని, రాహుల్ గాంధీ సహజమైన నాయకుడని సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతోందని, అన్ని విపక్ష పార్టీలు విబేధాలను విడనాడి ఏకతాటిపైకి రావాలన్నారు. బీజేపిని గద్దె దించాలంటే ప్రతిపక్షపార్టీలు సంఘటితం కావాలన్నారు. ‘ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత. విపక్షాలను ఐక్యంగా ఒక వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు సహజంగా బీజేపి వ్యతిరేక కూటమికి రాహుల్ గాంధీ సారథ్యం వహిస్తారు ’ అని ఆమె అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు షీలాదీక్షిత్ పనిచేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు, అనంతరం పరిణామాలతో విపక్ష పార్టీల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. ఆమె ఇక్కడ వార్తా ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, బీజేపియేతర పార్టీలు ఒక కూటమిగా అవతరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దీనికి సర్దుబాట్లు కావాలి. పరస్పరం అర్థం చేసుకోవాలి అని ఆమె అన్నారు. విపక్ష పార్టీల మధ్య ఏమైనా చిన్న చిన్న తేడాలుంటే సరిదిద్దేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. భారతదేశం అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ సమయంలో విపక్ష పార్టీలు దేశ భవిష్యత్తు కోసం అభిప్రాయ బేధాలను విడనాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని, దేశ సమైక్యత ముఖ్యమని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికి ఈ దేశం నాది, నేను భారతీయుడనే భావనను కల్పించడంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. రాహుల్ గాంధీ బలమైన నాయకుడని, సమర్ధుడని ఆమె ప్రశంసించారు. విపక్ష పార్టీలను సంఘటితం చేసే సత్తా రాహుల్ గాంధీకి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు సోనియాగాంధీ ఒక చోదక శక్తి అని ఆమె అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే విషయం సోనియాగాంధీకి తెలుసున్నారు. బాధ్యతల నిర్వహణలో సోనియా ముందుంటారన్నారు. నాగ్‌పూర్ ఆరెస్సెస్ సమావేశంలో మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగం బాగుందని, కాని ప్రణబ్ ఈ సదస్సుకు ఎందుకు హాజరయ్యారో కాంగ్రెస్ నేతలకు తెలియదన్నారు. ఈ విషయమై కాంగ్రెస్‌లో అసంతృప్తి ఉందన్నారు. ఆరెస్సెస్ సమావేశంలో ప్రణబ్ బాగా మాట్లాడారని, ప్రశంసించదగినదని ఆమె అన్నారు. ఆరెస్సెస్ సదస్సుకు ప్రణబ్ హాజరుకావడం ద్వారా ఆ సంస్థ సిద్ధాంతానికి చట్టబద్ధత కల్పించినట్లా అని అడగ్గా, ఆ సంగతి ఆరెస్సెస్ వారికే బాగా తెలుస్తుందన్నారు. వారి వస్తధ్రారణ, ఆలోచన ధోరణి ప్రత్యేకమన్నారు. ప్రణబ్ వల్ల ఆరెస్సెస్ లాభపడిందన్నారు.