జాతీయ వార్తలు

వౌలిక సదుపాయల తర్వాతే ఏపీలో హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన సముదాయాలు, ఇతర వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగానే రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని కేంద్ర న్యాయ శాఖ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
కాంగ్రెస్ విధాన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసే అంశంపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు బదులిస్తూ కేంద్ర న్యాయ శాఖ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు భవనాలు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, అధికారులకు వసతి ఏర్పాటు చేయవలసి ఉన్నది. హైకోర్టును ఎర్పాటు చేసేందుకు అవసరమైన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత అని కేంద్ర న్యాయ శాఖ తమ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనంత వరకు ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయటం సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసింది. అవిభాజిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చంచి ఏపీ హైకోర్టు భవనానికి అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేయవలసి ఉంటుందని న్యాయ శాఖ తమ అఫిడవిట్‌లో పేర్కొన్నది. ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదని అఫిడవిట్‌లో తెలిపారు. హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలి, వౌలిక సదుపాయాల పరిస్థితి ఏమిటి అనే అంశంపై ఏపీ ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర న్యాయ శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది.