జాతీయ వార్తలు

పాకిస్తాన్‌తో పోలుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సింబిత్ పాత్రా డిమాండ్ చేశారు. గురువారం పాత్రా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే భారత దేశం ‘హిందు పాకిస్తాన్’గా మారిపోతుందంటూ శశిథరూర్ చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. శశిథరూర్ చేసిన ప్రకటనకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు, హిందువులకు క్షమాపణలు చెప్పాలని ప్రాతా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న ఏఐసీసీలో ముస్లిం మైనారిటీ నాయకులు, మేధావులతో జరిపిన సమావేశంలో తాను ఇటీవల హిందు దేవాలయాలను సందర్శించినందుకు క్షమాపణలు చెబుతూ ఇక మీదట ఇలా జరగదని హామీ ఇచ్చినట్లు తెలిసిందని పాత్రా ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ముస్లిం, ఇతర మైనార్టీల మెప్పు పొందేందుకు హిందువులను అవమానించడం మానివేయాలని అన్నారు. ఇది ఎంతమాత్రం సమ్మతం కాదని అన్నారు. దేశం పట్ల, హిందువుల పట్ల కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ప్రేమ, అభిమానం లేదు. భారత సైన్యం జరిపిన మెరుపు దాడిని సైతం రాహుల్ అనుమానించారు. రక్తంతో దళారి పని (ఖూన్ కి దలాలీ) చేయవద్దంటూ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. ఇదేనా రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేశంపట్ల ఉన్న ప్రేమ అని పాత్రా నిలదీశారు. గులాం నబీ ఆజాద్ కొన్ని రోజుల క్రితం పత్రికల వారితో మాట్లాడుతూ భారత సైన్యం ఉగ్రవాదులను చంపదు.. కానీ పౌరులను చంపుతోందని ఆరోపించటం సిగ్గుచేటని అన్నారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్‌లో పర్యటిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయవలసిన అవసరం ఉందనే ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ నాయకులకు ఉన్న గౌరవాన్ని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు ప్రస్పుటం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాశ్మీర్‌కు ముషారఫ్ ప్రతిపాదించిన స్వాతంత్య్రం కావాలని మరో కాంగ్రెస్ నాయకుడు సైఫుద్దీన్ సోజ్ అంటారు. ఇదేనా రాహుల్‌కు, ఆ పార్టీ నాయకులకు దేశం మీద, ప్రజాస్వామ్య మీద, ప్రజల మీద ఉన్న ప్రేమ అని వ్యంగోక్తులు విసిరారు. భారత ప్రజలను క్యాటిల్ క్లాస్ (పశువుల తరగతి) అని గతంలో కించపరిచిన శశిథరూర్ ఇప్పుడు మరోసారి భారత ప్రజాస్వామ్యాన్ని ‘పశువుల సంత’ అంటూ అవమానిస్తూ పాకిస్తాన్‌తో సమానం చేయటం సిగ్గు చేటన్నారు. శశిథరూర్ పాకిస్తాన్ ప్రజలను ప్రేమించాలనుకుంటే ప్రేమించవచ్చు కానీ హిందుస్తాన్ పౌరులను ద్వేషించటం సముచితం కాదని పాత్రా స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని పాకిస్తాన్ ప్రజాస్వామ్యంతో పోలుస్తారా అని శశిథరూర్‌ను ఆయన నిలదీశారు. పాకిస్తాన్ టెర్రరిస్తాన్, అది ఉగ్రవాదులను పెంచి, పోషిస్తోంది. రాహుల్ గాంధీ 2008లో హిందు ఉగ్రవాదం అనే పదాన్ని ప్రయోగించారు, దీనిని అప్పటి హోం శాఖ మంత్రి పి.చిదంబరం, ఆ తరువాత హోం శాఖ చేపట్టిన సుశీల్‌కుమార్ షిండే కూడా హిందు తీవ్రవాదం పదాన్ని పెంచి పోషించటం ద్వారా హిందువులను అవమానించారని సంబిత్ పాత్రా ఆరోపించారు. దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిం మైనారిటీలకు ఉంటుందంటూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజలను మతం ఆధారంగా విభిజించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ఇరవై రెండు వేల మంది ముస్లింలను ఊచకోత కోస్తారని రాహుల్ గాంధీ 2014లో ఆరోపిస్తే ఇప్పుడు శవిథరూర్ 2019లో బీజేపీ గెలిస్తే భారతదేశం హిందు పాకిస్తాన్ అవుతుందని అన్నారు. రాహుల్ గాంధీ ఆ పార్టీ నాయకులు దేశానికి, ప్రజలకు వివరణ ఇవ్వాలని పాత్రా డిమాండ్ చేశారు.

చిత్రాలు..బీజేపీని మళ్లీ గెలిపిస్తే దేశం ‘హిందు పాకిస్తాన్’గా మారిపోతుందంటూ వ్యాఖ్యానించిన శశిథరూర్
*బీజేపీ అధికార ప్రతినిధి సింబిత్ పాత్రా