జాతీయ వార్తలు

సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న 17 రాష్ట్రాల్లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు 1,100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర హోమ్‌శాఖ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులు విడుదలైనట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. 61 గ్రామాల్లో అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, మంచినీరు అంపించేందుకు ఇప్పటికే 126 కోట్ల విడుదల చేసినట్టు కేంద్రం స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం (బీఏడీపీ)కింద చేపట్టాల్సిన పనులపై కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. 17 రాష్ట్రాల్లోని 25 జిల్లాలకు చెందిన కలెక్టర్లు సమావేశానికి హాజరైనట్టు హోమ్‌శాఖ ప్రతినిధి వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 990 కోట్ల రూపాయలుండగా 1,100 కోట్లకు పెంచాలని బీఏడీపీ నిర్ణయించిందని అన్నారు. 61 సరిహద్దు గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సంబంధిత రాష్ట్రాలకు 126 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. అవసరాన్ని బట్టి అదనంగా నిధులు విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంపిక చేసిన గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించారు. ప్రాధిమిక ఆరోగ్య కేంద్రం, ప్రాధమిక పాఠశాల, కమ్యూనిటీ సెంటర్, డ్రైనేజీ, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 17 రాష్ట్రాల్లో 111 సరిహద్దు జిల్లాల్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను తమతమ నివేదికలు అందించాయి. అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకుని 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 1986-87 నుంచి ఇప్పటి వరకూ 13,400 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా బీఏడీపీ ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు, కార్యాచరణ ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల సకాలంలో అనుమతులు, పనులకు ఆమోదం త్వరగా లభిస్తుందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మైన్మార్, బంగ్లాదేశ్‌లు భారత్‌కు సరిహద్దు దేశాలు.

చిత్రం..ఢిల్లీలో గురువారం హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్‌నాథ్