జాతీయ వార్తలు

దురాచారాలపై పోరాడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: మహిళలు సామాజిక దురాచారాలపై రాజీలేకుండా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థిక స్వావలంభన దిశగా మహిళలు వడివడిగా అడుగులు వేసేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గురువారం ప్రధాని మోదీ దేశంలోని ఒక కోటి మంది మహిళా స్వయం సహాయక బృందాలతో నరేంద్ర మోదీ యాప్ ద్వారా మాట్లాడారు. మహిళలకు సాధికారత, ఔత్సాహిక పారిశ్రామిక విధానాలు, సృజనాత్మకత గురించి పెద్దగా చెప్పేదేముండదని, వారికి అవకాశం ఇస్తే ఉన్నత స్థానాలకు స్వీయ ప్రతిభతో ఎదుగుగతారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు తమను తాము ఆర్థికంగా అభివృద్ధి చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వారికి ప్రోత్సాహం అవసరమన్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తే శక్తివంతమైన దేశం అవతరిస్తుందన్నారు. 2014 నుంచి ఇంతవరకు 20 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశామని, ఇందులో 2.25 కోట్ల కుటుంబాలను చేర్చామన్నారు. ప్రస్తుతం దేశంలో 45 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, ఐదు కోట్ల మంది పనిచేస్తున్నారన్నారు. గ్రామీణాభివృద్ధికి పాడి పెంపకం, వ్యవసాయం ముఖ్యమని, ఈ రంగంలో మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని తమ అభిప్రాయాలను ప్రధాని మోదీకి తెలియచేశారు. స్వయం సహాయక బృందాల ద్వారా తమ జీవితాల్లో సాధించిన ప్రగతి, సాధికారత గురించి వారు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరగాలంటే స్వయం సహాయక బృందాలను పటిష్టం చేయాల్సి ఉందని మోదీ అన్నారు. ఒక సమాజం ఆర్థికంగా, విజ్ఞానవంతంగా ఎదగాలంటే మహిళల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు.
లక్ష్మీపూర్ మహిళలతో ప్రధాని
జగిత్యాల: దేశ ప్రగతికి స్వయం సహాయ బృందాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని నరేంద్రమోదీ జగిత్యాల మండలం లక్ష్మీపూర్ మహిళలతో అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్వయం సహాయ బృందాలతోపాటు లక్ష్మీపూర్ గ్రామ మహిళలతో ప్రధాని మోదీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కొన్ని రంగాల్లో మహిళలు లేనిది అభివృద్ధి అసాధ్యమని, వ్యవసాయం, దినచర్య, మహిళల సాయం లేకుండా ఏ పనీ చేయలేమన్నారు. దేశంలో మహిళలు అసలైన సాధికారిత పొందారని, దీన్ దయాల్ యోజన అన్ని రాష్ట్రాల్లో అమలైందని ఈ పథకం ద్వారా కోట్లాది నిరుపేద మహిళలకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు చెందిన మహిళలకు అందేలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. స్వయం సహాయ బృందాలు ప్రభుత్వానికి సంబంధించిన ఈ మార్కెట్ ఫ్లస్ అనే వెబ్‌సైట్ లో నమోదు చేసుకోవాలని మోదీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ లక్ష్మి, ఇన్‌చార్జి దామెర మాధవి, మండల అధ్యక్షురాలు ఎడ్మల మమత, లక్ష్మీపూర్ గ్రామ అధ్యక్షురాలు కొదురుపాక చంద్రకళ, రాసమల్ల సరిత, బాశెట్టి పద్మ పాల్గొన్నారు.

చిత్రం..లక్ష్మిపూర్ మహిళలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ