జాతీయ వార్తలు

ప్రాచీన సంపదను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: భారత దేశ చరిత్ర, ఔన్నత్యం, పురావస్తు ప్రాధాన్యత ఉన్న స్థలాల పరిరక్షణపై యువతలో అవగాహన పెంపొందించేందుకు పురావస్తు నిపుణులు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ ఆయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ధరోవర్ భవన్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చారిత్రక ప్రదేశాలు, కట్టడాల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. తమ దేశ పూర్వ చరిత్ర, కట్టడాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ప్రాచీన చరిత్ర ద్వారా సంక్రమించిన విశిష్టతను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొన్ని కట్టడాల వద్ద ప్రజలు ఫోటోలు తీసుకోకుండా ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు సహకారం వల్లనే ప్రపంచంలోని గొప్ప చారిత్రక కట్టడాల పరిరక్షణ సాధ్యమైందన్నారు. మీరు ఏ కట్టడాన్ని సందర్శించినా, రిటైర్డయిన వారు గైడ్‌లుగా పనిచేయడాన్ని చూస్తాం. సమాజమే మన చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవడానికి సమాయత్తం కావాలి’ అని ఆయన హితవు చెప్పారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే హెరిటేజ్ ప్రదేశాలను కాపాడుకుందామన్నారు. దేశంలో వంద నగరాల్లో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వీటిని ఆ రాష్ట్ర పాఠ్యాశాల సిలబస్‌లో చేర్చించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. యువకులకు హెరిటేజ్ ప్రదేశాల చరిత్రను అధ్యయనం చేయడం, వీటి గురించి వివరించడంపై శిక్షణ ఇవ్వాలన్నారు. భారతదేశం గర్వించదగిన ప్రాచీన చరిత్ర ఉన్న గొప్ప దేశమని, హెరిటేజ్‌ప్రదేశాలను పరిరక్షించేందుకు కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చి అవసరమైన నిధులను సమకూర్చాలన్నారు. శాటిలైట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి ఫోటోలను తీసుకుంటుంటే, ఇంకా కొన్ని చోట్ల ఫోటోలపై ఆంక్షలు ఎందుకన్నారు. చరిత్రలో శిలాశాసనాలు చెప్పే వాస్తవాలు గొప్పవని, అవి ఎప్పటికీ సజీవంగా ఉంటాయన్నారు. ఆర్కియాలజీలో ప్రతిపేజీకి చరిత్ర ఉంటుందన్నారు. తనకు అహమ్మదాబాద్‌లో తెలిసిన వైద్యుడు హరిభాయ్ గోదాని ప్రాచీన వస్తువులను, కళాఖండాలను సేకరించారన్నారు. 800 సంవత్సరాల క్రితం ఉన్న వస్తువులను కూడా భద్రపరిచారన్నారు. ఏళ్లక్రితం చెక్కినశిల్పాలు చూస్తే ఆ రోజుల్లోనే నిండుచూలాలు వేదన, గర్భంలో శిశువు గురించి శిల్పులు అద్భుతంగా చెప్పారని నరేంద్రమోదీ అన్నారు. గర్భంలో పిండం చుట్టూ ఉన్న పొరల గురించి ఆ రోజుల్లోనే శిల్పులు తమనైపుణ్యంతో దార్శనికతతో చూసినట్లుగా శిల్పాలను చెక్కారన్నారు. ఇటీవల కాలంలో ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాంకోస్ హోలాండ్ భారత్‌కు విచ్చేసినప్పుడు చండీఘడ్‌లో సందర్శించిన ఆర్కియాలజీ ప్రదేశాల గురించి ఆయన ప్రస్తావించారు.
చిత్రం..ఢిల్లీలో గురువారం ధరోవర్ భవన్‌ను ప్రారంభించిన అనంతరం
అందులో భద్రపరచిన వ్రాతపతులను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ