జాతీయ వార్తలు

మిషనరీలను అపఖ్యాతి పాలు చేస్తున్న బీజేపీ : మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 12: మథర్ థెరిస్సా నెలకొల్పిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ పేరును చెడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. రాంచీలోని మిషనరీస్ ఆఫ్ చారిటీలో పసిపిల్లలను అమ్ముకుంటున్నారంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ఇలాంటి చిన్న సంఘటనను ఆధారం చేసుకుని మిషనరీస్‌కు చెందిన సిస్టర్స్‌కు చెడ్డపేరు వచ్చేలా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలావుండగా రాంచీలోని ఓ చారిటీలో పసిపిల్లలను అమ్ముతున్నట్లు కేసు నమోదైంది. చారిటీని నిర్వహించే నిర్మల్ హ్రిడేను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని ముగ్గురు పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. మరో పసిగుడ్డుకోసం విచారణ ప్రారంభించినట్లు రాంచీ ఎస్పీ అనిస్ గుప్తా తెలిపారు. నిర్మల్ హ్రిడే ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీ నుంచి 22 మంది అనాథ పిల్లలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రకటించింది. ఈ మిషనరీకి సంబంధించిన హెడ్‌క్వార్టర్స్ కోల్‌కతాలో ఉండడం గమనార్హం.