జాతీయ వార్తలు

విద్యా రంగంలో మతతత్వ విధానాలను వ్యతిరేకించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: విద్యా రంగంలో హిందుత్వ, నయా ఉదారవాద చొప్పిస్తూ బ్రష్టుపట్టిస్తున్న బీజేపీ మతతత్వ విధానాలను వ్యతిరేకించాలని అధ్యాపకులు, విద్యార్థులకు సీపీఎం పిలుపునిచ్చింది. పార్టీ పత్రిక పీపుల్స్ డెమాక్రసీలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కేంద్రం అనుసరిస్తున్న విద్యావిధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ వ్యాసం రాశారు. యూజీసీని రద్దు చేయడం, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం తదితర విధానాల వెనక హిందుత్వ కోణం దాగి ఉందన్నారు. విద్యారంగాన్ని నయా ఉదారవాదం, హిందుత్వ సిద్ధాంతాలతో విషపూరితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉన్నత విద్యను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఫీజులను పెంచారని అన్నారు. విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు క్షీణిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ దశలో ప్రజలు, విద్యార్ధులు, అధ్యాపకులు ప్రభుత్వ దుర్మార్గ విధానాలను సమష్టిగా ఎదుర్కొనాలన్నారు. ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా ముసుగులో విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో బాగా నడిచే సంస్థలు కుప్పకూలే విధంగా చేస్తున్నారన్నారు. ఉన్నత విద్యా రంగంలో హిందుత్వ అజెండా శక్తులను చొరబడి ప్రమాణాలను ధ్వంసం చేస్తున్నాయన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలకు అరెస్సెస్ నేపథ్యం ఉన్న వారిని చాన్సలర్లు, వైస్‌చాన్సలర్లుగా నియమిస్తున్నారని ఆయన అన్నారు. ఆరెస్సెస్‌కు విధేయత కలిగి ఉండడం అర్హతగా పరిగణిస్తున్నారన్నారు.