జాతీయ వార్తలు

అందరూ ఉరే వేసుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతులందరూ ఆత్మహత్య చేసుకుని మరణించారని పోస్టుమార్టమ్ నివేదికలోవైద్యులు తేల్చారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులందరూ ఉరివేసుకుని మరణించారు. బురారీ కుటుంబానికి చెందిన 11 మంది ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం విదితమే. ఇందులో 10 మంది వ్యక్తులు ఉరివేసుకుని సీలింగ్ నుంచి వేలాడుతూ కనపడ్డారు. పదకొండో వ్యక్తి 77 ఏళ్ల నారాయణదేవి మృతదేహాన్ని వేరే గదిలో పోలీసులు కనుగొన్నారు. ఆమె సమీపంలో ఒక బెల్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వృద్ధురాలు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించిందని పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. ఆత్మహత్యల వెనక ఎటువంటి కుట్ర లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనా ప్రదేశంలో 11 డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలను ఇందులో వివరించారు. దేవుడిని చేరేందుకు దారిపై ఆధ్యాత్మిక విషయాలను రాసుకున్నారు.