జాతీయ వార్తలు

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దాదా వస్వానీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే, జూలై 12: హిందూ ఆధ్యాత్మిక గురువు, సాధు వస్వానీ మిషన్ అధిపతి దాదా జేపీ వస్వానీ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 99 ఏళ్లు. వయోభారంతో బాధపడుతున్న ఆయనను గతవారం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం కాస్తమెరుగుపడడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు మిషన్ వెల్లడించింది. పూణేలోని సాధు వస్వానీ ప్రాంగణంలోనే ఉదయం కన్నుమూశారని వారన్నారు. జేపీ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని మిషన్ సభ్యుడు ఉషాకర్నానీ వెల్లడించారు. సాధూ వాస్వానీ మిషన్ స్వర్ణోత్సవాలు వచ్చేనెలలో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో జేపీ మృతి చెందడం విషాదాన్ని నింపింది. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తరచూ మిషన్‌ను సందర్శిస్తారు. శుక్రవారం జరిగే వస్వానీ అంత్యక్రియలకు అద్వానీ హాజరవుతారని ఆమె తెలిపారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మే నెలలో మిషన్‌ను సందర్శించి సాధు వస్వానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు. జేపీ మృతికి సంతాపం తెలుపుతూ రాష్టప్రతి ఓ సందేశం పంపారు. విద్యాభివృద్ధికి ఎంతోపాటు పడ్డ మానవతామూర్తి అని ఆయన శ్లాఘించారు. బాలికల విద్యకు ఎంతోపాటుపడ్డ మహనీయుడు వస్వానీ అంటూ ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

2016 సెప్టెంబర్ 16న ఢిల్లీలో దాదా జేపీ వస్వానీని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)