జాతీయ వార్తలు

బుద్ధుడు మళ్లీ నవ్వాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, జూలై 12: స్వాత్ లోయ పూర్వ వైభవం సంతరించుకుంది. ముష్కర తాలిబాన్ల చెర నుంచి విముక్తి చెందిన స్వాత్ లోయ ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. 1947 వరకు అఖండ భారతంలో భాగమై ఉన్న స్వాత్ లోయ దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు దక్కింది. ఇక్కడ ఒకప్పుడు బౌద్ధ మతం విరాజిల్లింది. కాలక్రమంలో ఇస్లాం మత ప్రభావం వల్ల బౌద్ధం తన ఉనికిని కోల్పోయింది. కాని శతాబ్ధాల క్రితం ఆ నాటి బౌద్ధులు చెక్కిన అత్యంత అద్భుతమైన బౌద్ధ శిల్పాలు మాత్రం చెక్కుచెదరలేదు. కాని 2000 సంవత్సరం తర్వాత తాలిబాన్ ఉగ్రవాదులు స్వాత్‌లోయప్రాంతాన్ని ఆక్రమించారు. 2007లో పాకిస్తాన్ తాలిబాన్లు స్వాత్ లోయలో ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న ధ్యాన ముద్రలో ఉన్న బౌద్ధ విగ్రహాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. సాంస్కృతిక కట్టడమైన బుద్ధుడి విగ్రహంపై పేల్చడానికి విఫలయత్నం చేశారు. కాని పేలుడు పదార్థాల ధాటికి బుద్ధుడి ముఖం ముక్కలైంది. అప్పట్లో ప్రపంచంలోని దేశాలు పాక్ తాలిబాన్ల దుశ్చర్యలను, ముష్కర దాడులను ముక్తకంఠంతో ఖండించారు. బుద్ధ విగ్రహానికి మరమ్మత్తులు చేసేందుకు ఇటలీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2.9 మిలియన్ డాలర్లతో ఈ విగ్రహాన్ని పునరుద్ధరించింది. లూకా మారియా ఓలివైరి అనే ఆర్కిటెక్ట్ మహా సంకల్పంతో, మొక్కవోనివిశ్వాసంతో ఈ విగ్రహానికి పూర్వ వైభవం, సౌందర్యం తెచ్చారు. గ్రానైట్‌పై ఈ విగ్రహాన్ని శతాబ్ధాల క్రితమే చెక్కి ఉన్నారు. ఇటలీ ల్యాబ్‌లో ఆధునిక టెక్నాలజీతో 3డి లేజర్ సర్వేలు, పాత ఫోటోలతో బుద్ధుడి విగ్రహానికి మరమ్మత్తులు చేసి పాత విగ్రహం మాదిరిగా ఉండేటట్లు పునరుద్ధరించారు, 2012లో ప్రారంభించిన విగ్రహ పునరుద్ధరణ పనులు 2016తో పూర్తయ్యాయి. ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచంలోని బౌద్ధదేశాల ప్రజలు స్వాత్ లోయకు వెళ్లేందుకు ఆసక్తికనపరుస్తున్నారు. విధ్వంసానికి ముందు బుద్ధుడి ముఖం చిరునవ్వుతో ఉండేది. ప్రస్తుతం అదే రూపం దర్శనమిస్తుంది. ఇక్కడ కొన్ని వేల బౌద్ధ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని మరమ్మత్తు చేసి పూర్వ స్థితి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్వాత్ లోయ ప్రజలు మిగతా ప్రాంతంతో పోల్చితే తమ పూర్వ చరిత్రంటే చెవులు కోసుకుంటారు. 2007లో ముల్లా ఫైజుల్లా అనే తాలిబాన్ తండాకు చెందిన నేత దాడుల్లో స్వాత్ లోయ చితికిపోయింది. వందలాది పాఠశాలలు మూతపడ్డాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యూజిక్ షాప్స్, ఆట, పాటను నిషేధించారు. 2009లో పాక్ ఆర్మీ రెహా ఇ రస్ట్ అనే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించి తాలిబాన్లను నిర్మూలించారు. అమెరికా డ్రోన్ల దాడిలో పైజుల్లా హతమయ్యాడు. స్వాత్ లోయ కళకళలాడుతోంది. తమ లోయ అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు వస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు.
*
పదకొండేళ్ల క్రితం తాలిబన్ మిలిటెంట్లు స్వాత్ ప్రాంతంలో డైనమైట్‌తో పేల్చివేసిన బుద్ధ విగ్రహాన్ని తాజాగా పునరుద్ధరించారు. దక్షిణాసియాలోనే రాతిపై చెక్కిన 7వ శతాబ్దం నాటి అతిపెద్ద బుద్ధ విగ్రహమిది