జాతీయ వార్తలు

బంగ్లా ఒత్తిళ్లకు లొంగిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: బంగ్లాదేశ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయే భారత్ తన వీసా తిరస్కరించిందని బ్రిటన్ లార్డ్స్ సభ్యుడు అలెగ్జాండర్ కార్లిలే ఆరోపించారు. జైలుశిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు అలెగ్జాండర్ న్యాయసలహాదారుగా ఉన్నారు. కేసుకు సంబంధించి వివరాలు ఇక్కడ మీడియాకు వెల్లడించేందుకు బుధవారం రాత్రి ఆయన ఢిల్లీ వచ్చారు. అయితే ఆయనను అధికారులు విమానాశ్రయంలోనే నిలిపివేశాలు. వీసాలో సరైన కారణాలు చూపలేదని అలెగ్జాండర్‌ను అనుమతించలేదు. వెనక్కివెళ్లిపోయిన కార్లిలే యూకే నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం మీడియాతో మాట్లాడారు. వీసా దరఖాస్తులో అన్ని విషయాలూ పేర్కొన్నానని, అయితే భారత అధికారులు బంగ్లాదేశ్ వత్తిళ్లకు తలొగ్గి తిరస్కరించిందని ఎంపీ ఆరోపించారు. ఢాకాలోని భారత హైకమిషనర్ ద్వారా బంగ్లాదేశ్ ప్ర భుత్వం అడ్డుకుందని విమర్శించారు. కార్లిలే సరైన వీసాతోరాలేనందుకే అనుమతి నిరాకరించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ వివరణ ఇచ్చారు. భార త్ ప్రభు త్వం తనకు బిజినెస్ ఈ- వీసా మంజూరు చేసి, ఇప్పుడు అవాస్తవాలు చెబుతోందని లార్డ్స్ సభ్యుడు ధ్వజమెత్తారు.