జాతీయ వార్తలు

ద్వైపాక్షికంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/బంగ్లాదేశ్, జూలై 13: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ బంగ్లాదేశ్ మూడు రోజుల పర్యటనకు శుక్రవారం బయలుదేరి రాత్రి పొద్దుపోయిన తరువాత ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఆయన రోహింగ్యా శరణార్థుల వలస, ఉగ్రవాద నిర్మూలపై సహకారం తదితర అంశాలపై బంగ్లాదేశ్ నాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రాజ్ నాథ్‌సింగ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను కలుస్తారు. ద్వైపాక్షిక అంశాలప చర్చించనున్నారు. బంగ్లాదేశ్, భారత్ ఉమ్మడి చరిత్ర, సంస్కృతి కలిగి ఉన్నా దేశాలు. ఈ రెండు దేశాల మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల ప్రజలు ప్రజాస్వామ్య ప్రియులు. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి. ఈ పర్యటన తప్పనిసరిగా ఇరు దేశాలకు మేలు చేకూరే విధంగా ఉంటుంది’ అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య శతాబ్ధాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యలకు పరిష్కారం కనుగొన్నామన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొందన్నారు. అలాగే సముద్రంలో జల సరిహద్దుల వివాదం కూడా పరిష్కారమైందన్నారు.
ఈ రెండు దేశాల మధ్య శాంతి, సహకారం పరిఢవిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ పర్యటనలో రాజ్ నాథ్‌సింగ్ తొలుత 14వ తేదీన బంగ్లాదేశ్ హోంశాఖ మంత్రి అసదుజ్‌మాన్ ఖాన్‌ను కలుస్తారు. ఇరు దేశాలకు సవాలుగా తయారైన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయమై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో హోంశాఖమంత్రి వెంట భద్రతా ఏజన్సీ అధిపతులు ఉంటారు. ఇరుదేశాల మధ్య అక్రమ ఆయుధాలు, స్మగ్లింగ్‌ను నిరోధించే విషయమై అధికారుల స్థాయిలో చర్చలు జరగనున్నాయి. భారత్ కరెన్సీని ముద్రించి అక్రమంగా చలామణి చేసే ప్రయత్నాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి బంగ్లాదేశ్‌ను గట్టిగా కోరనున్నారు. ఇటీవల కాలంలో రూ.13.66 లక్షల నకిలీ కరెన్సీని సరిహద్దుల్లో భారత్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది రూ.68.96 లక్షల నకలీ కరెన్సీ నోట్లను అధికారులు పట్టుకున్నారు. అలాగే సరిహద్దుల వెంట క్రిమినల్స్ భారత్‌లో చొరబడేందుకు బీఎస్‌ఎఫ్ జవాన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో 2017లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, 122 మంది గాయపడ్డారు. కాగా 2016లో క్రిమినల్స్ దాడుల్లో 109 మంది గాయపడ్డారు. కాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించింది. సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలు లేకుండా బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పుల జరపడం వల్ల నష్టం వాటిల్లుతున్న అంశాన్ని బంగ్లాదేశ్ ప్రస్తావించనుంది. భారత్-బంగ్లాదేశ్‌లో 4096 కి.మీ పొడువైన సరిహద్దును కలిగి ఉన్నాయి.