జాతీయ వార్తలు

ముస్లిం మహిళల సంక్షేమం పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆజంగఢ్, జూలై 14: ముస్లిం మహిళల సంక్షేమం, వారి కుటుంబ భద్రతంటే కాంగ్రెస్‌కు లెక్కలేదని, వీరిని నిర్లక్ష్యం చేసిందని, కేవలం ముస్లింలలో పురుషుల బాగోగులను మాత్రమే ఆ పార్టీ పట్టించుకుందని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ముస్లిం మహిళల హక్కులు, భద్రత కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, కాంగ్రెస్ తదితర పార్టీలు మహిళలకు అండగా నిలబడకుండా తలాఖ్ నిషేధ బిల్లు అమలుకు అడ్డుపడుతోందన్నారు. కాంగ్రెస్, తదితర పార్టీలు అనుసరిస్తున్న ధోరణి వల్ల ముస్లిం మహిళలు ప్రమాద పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుపీ పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో మూడుసార్లు తలాఖ్ పద్ధతిని నిషేధించే బిల్లుకు ఆమోదం లభించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అజంగర్ సభలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కోట్లాది మంది ముస్లిం మహిళలు మూడుసార్లు తలాఖ్ పద్దతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ పద్ధతి అమలులోలేదన్నారు. ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారని, ఆచరణలో ఏమి చేస్తున్నారని ఆయన నిలదీశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో పురుషులకోసమే పనిచేస్తుందా అని అడిగారు. ముస్లిం మహిళల ఔన్నత్యం, వారి ఆత్మాభిమానం కోసం రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్లమెంటులో తలాఖ్ పద్ధతిని నిషేధించే బిల్లుకు కాంగ్రెస్ పడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వచ్చే నాలుగైదు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయని, తలాఖ్ బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని, అధ్యయనం చేయాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు. ఇక్కడ 340 కి.మీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం 21వ శతాబ్ధంలో ఉన్నామని, కాని ఈ దేశంలో చాలా పార్టీలు ఇంకా 18వ శతాబ్ధంలో ఉన్నాయన్నారు. తలాఖ్ పద్ధతిని స్వస్తి చెప్పేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఈ పార్టీలన్నీ అడుగడుగునా అడ్డుపడ్డాయన్నారు. ఈ తరహా పార్టీల ధోరణుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీకి దేశమంతా కుటుంబమని ఆయన చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ పార్టీలు రాంమనోహర్ లోహియా, అంబేద్కర్ మహాశయుడి పేరిట రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
కేవలం ఓటు రాజకీయాల తప్ప దేశాభివృద్ధి గురించి ఈ పార్టీలు పట్టించుకోవన్నారు. సాధారణ రోజుల్లో ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకునే ఈ పార్టీలు ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను నిలుపుదల చేయడమే ఈ పార్టీల కర్తవ్యంగా కనపడుతోందన్నారు.