జాతీయ వార్తలు

మహిళలకు వేధింపులు నిత్య సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: పనిచేసే చోట లైంగిక వేధింపులు ఇప్పటికీ మహిళలకు నిత్యసమస్యగా మారిందని ముఖ్యంగా ఇది ప్రజలకు వినోదాన్ని అందించే చిత్రపరిశ్రమలో ఎక్కువగా ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ పేర్కొన్నారు. ‘పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులు’ అనే అంశంపై పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సెమినార్‌లో ఆమె మాట్లాడుతూ హాలీవుడ్‌లో మీ టూ (నేను సైతం) ప్రచారం ఉద్ధృతం అయినప్పటి నుంచి చిత్రపరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల విషయం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. ఈ సమాజంలో వేధింపులు చాలా తీవ్రమైన విషయమని, సహజంగా పురుషాధిక్యం గల చిత్రపరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల విషయంపై ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలని ఆమె పేర్కొన్నారు. పనిచేసే చోట లైంగిక వేధింపులు అన్నది ప్రతి మహిళ వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్య అని, అయితే చాలామంది మహిళలు తాము ఎదుర్కొంటున్న ఈ బాధలపై ఎవరికీ ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. ప్యానల్‌లో చర్చల అనంతరం డబ్ల్యుసిసి ప్రతినిధి, మలయాళం నటి రంజనీ శాష తదితరులు చిత్రపరిశ్రమలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వేధింపులపై అంతర్జాతీయ ఫిర్యాదుల కమిటీ (ఐసిసి) ఏర్పాటు చేయాలని సూచించారని రేఖాశర్మ చెప్పారు. ఈ సెమినార్‌లో పలువురు చిత్రపరిశ్రమకు చెందిన వారితో పాటు లా కాలేజీ విద్యార్థులు, బాలీవుడ్‌కుచెందిన యశ్‌రాజ్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్, ముక్తా ఆర్ట్స్, ప్రితీష్ నంది కమ్యూనికేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.