జాతీయ వార్తలు

జోగీ కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రసక్తే లేదు : పునియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని, ఆయనకు పార్టీ తలుపులు మూసుకుపోయాయని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పిఎల్ పునియా స్పష్టం చేశారు. అలాగే మాయావతి నేతృత్వంలోని బహుజన్‌సమాజ్ పార్టీకి, జోగికి ఎలాంతి పొత్తు ఉండదని అన్నారు. జోగి, బీజేపీ కలిసి ఈ వదంతులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. బస్తర్ జిల్లాలోని జీరమ్ లోయలో 2013లో నక్సల్స్ జరిపిన దాడిలో తమ నాయకత్వానికి తీవ్ర నష్టం జరిగిందని, ఈ దాడి వెనుక జోగి హస్తం ఉందని ఆరోపించారు. ఇది మరచిపోలేని విషయమని ఆయన అన్నారు. అతను తిరిగి కాంగ్రెస్‌లో రావడం అసంభవమని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోగి సహాయం తీసుకుంటుందన్న యోచనపై పార్టీ వర్గాల్లో వస్తున్న నిరసనను అధిష్టానం అధిగమిస్తుందని ప్రచారం జరుగుతోందన్నారు. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓట్లపై జరుగుతున్న కుట్ర అని అన్నారు. గత 15 సంవత్సరాలుగా బీజేపీ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉంది. ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రెండువిడతల ప్రచారం నిర్వహించనుంది. ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని మేలో ప్రారంభించగా, రెండో విడతను ఆగస్టులో మొదలుపెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్-మాయావతి పొత్తును పునియా సమర్థించారు. బిఎస్పీతో తమ పొత్తుతో రాష్ట్రంలో తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఆ పార్టీతో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పార్టీ నేతలతో శనివారం చర్చలు జరిపారని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్-బిఎస్పీ పొత్తు గురించి ఇందులో చర్చించారన్నారు.