జాతీయ వార్తలు

బహ్రేన్ ప్రధానితో సుష్మా ద్వైపాక్షిక చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనామా, జూలై 15: బహ్రేన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం ఆ దేశ ప్రధాని ఖలిఫా బిన్ సల్మాన్, అల్ ఖలీఫాతో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం బహ్రేన్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో కలిసి జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు. 2015 డిసెంబర్‌లో భారత్, బహ్రేన్ హైజాయింట్ కమిషన్ (హెచ్‌జేసీ) మొదటి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఆతర్వాత ఇరు దేశాల మధ్య హెచ్‌జేసీ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. బహ్రేన్ విదేశాంగ మంత్రి షేక్ ఖలీద్ మాట్లాడుతూ, భారత్‌తో తమ దేశానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. బహ్రేన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారు ఎంతో మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకూ ఉన్నారని, అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిలో వారి పాత్ర ఉందని ప్రశంసించారు. దేశ జనాభాలో నాలుగో వంతు భారతీయులేనని ఆయన అన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానిని కలిసిన సుష్మా ఆయనకు ‘్భరత్ ఏక్ ప్రీచరీ’ సంపుటిని బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకాలను మనామా లైబ్రరీలో ఉంచుతారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలతోపాటు, పరస్పర సహకారం, అవగాహన అంశా లూ చర్చకు వచ్చినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.