జాతీయ వార్తలు

మత హింస, దాడులపై మోదీని నిలదీస్తాం : వామపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశంలో జరుగుతున్న మత హింస, అమాయకులపై దాడులు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై సీపీపిఐ, సీపీఐ (ఎం) చర్చించాయి. దేశంలో మతవిద్వేషాలు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమాయకులు అనేకమంది బలైపోతున్నారని, ఈ విషయాలన్నీ ఉభయసభల్లో లేవనెత్తాలని నిర్ణయించినట్టు సీపీఐ (ఎం) ఎంపీ మహమ్మద్ సలీమ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విభజించు- పాలించు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని, తాము దీనిపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేస్తామని ఆయన చెప్పారు. అలాగే దళితులు, ఇతర నిమ్నవర్గాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్వీర్యం చేస్తోందని, ప్రతిరోజు వారిపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. కచ్చితంగా వీటిపై తాము ప్రధాని మోదీని నిలదీస్తామని చెప్పారు. అలాగే రైతుల ఆత్మహత్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే మద్దతు ధర విషయంలో స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సులను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అనే మోదీ నినాదాన్ని ఆయన బోగస్ అంటూ కొట్టివేశారు. మోదీ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైతుల గురించి ఏమైనా చేస్తుందా లేదా అని తాము నిలదీస్తామన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్రాల సంబంధాల గురించి ప్రస్తావిస్తామని చెప్పారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరించివేస్తోందని ఆయన విమర్శించారు. పాఠ్యాంశాల్లో హిందుత్వను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలతో కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. తాము ఇతర విపక్ష పార్టీలతో కూడా సంప్రదించి జాతి ప్రయోజనాలతో కూడిన అంశాలను పార్లమెంట్ సమావేశాలలో ప్రస్తావిస్తామని సిపిఎం ఎంపీ మహమ్మద్ సలీమ్ చెప్పారు.