జాతీయ వార్తలు

హజ్‌కు ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: హజ్ యాత్రపై ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల కారణంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో హజ్‌యాత్రికులు పెరిగారని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మొదటి విడతగా 410 మంది హజ్‌యాత్రికుల ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. 12 వందల మందికిపైగా హజ్ యాత్రికులు ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి సౌదీఅరేబియాకు శనివారం బయలుదేరారని ఆయన చెప్పారు. హజ్ యాత్రకు సబ్సిడీ రద్దు చేయడం, మహిళా యాత్రికులు పురుషులు, ఇతర సహాయకులతోనే వెళ్లాలన్న నిబంధనలు తొలగించడం వల్ల ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. హజ్ యాత్రకు సబ్సిడీ రద్దు చేయడం వల్ల యాత్ర ఖర్చు మూడు నాలుగు రెట్లు పెరుగుతుందన్న విమర్శల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. సబ్సిడీ రద్దుతో వచ్చే ఖర్చు తేడా స్వల్పమాత్రమేనని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో 1,75,025 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. ఇందులో మహిళలు 47 శాతం మంది ఉన్నారని ఆయన వివరించారు. అలాగే మహిళలు సహాయకులు లేకుండా హజ్‌కు వెళ్లడం ఇదే మొదటిసారన్నారు. ఇది సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, ఇందులో ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప ఏముందని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ అవి పూర్తిగా అర్థం లేనివని అన్నారు. సహాయకులు లేకుండా మహిళలు హజ్ యాత్రకు రాకూడదని సౌదీ ప్రభుత్వం ఎప్పుడూ ఆంక్షలు విధించలేదని ఆయన స్పష్టం చేశారు. సహాయకులు లేకుండా ఇప్పటికే ముస్లిం దేశాలైన మలేషియా, పాకిస్తాన్, ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి మహిళలు హజ్‌యాత్రకు వస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.