జాతీయ వార్తలు

రష్యా ఆధ్వర్యంలో మెగా మిలిటరీ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: రష్యా ఆధ్వర్యంలో వచ్చే నెల 20 నుంచి 29వ తేదీల మధ్య జరిగే మెగా మిలిటరీ విన్యాసాల్లో రష్యాతో పాటు, భారత్, పాకిస్తాన్, షాంఘై సహకార సంస్థలోని సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపడం, వేర్పాటువాదుల పీచమణచడం, ఈ లక్ష్యసాధనకు వ్యూహాలను అమలు చేయడంపై పరస్పరం సహకారం అందించుకోవడం లక్ష్యంగా మెగా మిలిటరీ విన్యాసాలు నిర్వహించనున్నారు. భారత్ నుంచి 200 మందికి పైగా ఆర్మీ, వైమానిక విభాగానికి చెందిన మెరిక్కలాంటి సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విన్యాసాలు రష్యా పశ్చిమ ప్రాంతంలో చెల్యాబింక్స్ నగరంలో జరుగుతాయి. చైనా, కజగిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పాల్గొంటాయని అధికారులు చెప్పరు. మూడు నెలల ముందుగా మెగా మిలిటరీ విన్యాసాలను నిర్వహించాలని షాంఘై సహకార సంస్థ ప్రణాళికను ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్ నెలలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరిగిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటు వాద ధోరణులను నిర్మూలించేందుకు షాంఘై సహకార సంస్ధ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడులకు దిగినప్పుడు ధీటుగా ఎదుర్కొనే విషయమై సైనికులకు ఈ విన్యాసాల ద్వారా అర్థమవుతుందన్నా రు. ఉగ్రవాద సంస్థల సమాచారాన్ని షాం ఘై సహకార సంస్థ దేశాలు పంచుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. కాగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయాలని, వారిని ప్రోత్సహించరాదని పాకిస్తాన్‌పై భారత్ మొదటి నుంచి వత్తిడి తెస్తోంది. షాంఘై సదస్సులో కూడా భారత్ ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.