జాతీయ వార్తలు

ఎస్సీ విద్యార్థులపై ఒత్తిడి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థుల్లో పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలకు అర్హులైన వారికి సొమ్మును చెల్లించేందుకు వీలుగా గడువును పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీంను ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యా సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. ఈ ఆదేశాలను విద్యా సంస్థ లు పాటించాలని ఆదేశించింది. ఎస్సీ విద్యార్థులు ఫీజు చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారనే కారణంపై కొన్ని విద్యా సంస్థలు వారికి అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీం తో ఈ ఏడాది మేలో ఈ అంశానికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వివిధ విద్యా సంస్థ ల్లో పోస్టుమెట్రిక్ లేదా పదో తరగతి తర్వాత కోర్సుల్లో ఎస్సీ విద్యార్థులు చేరుతున్నారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు కేం ద్రం పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాన్ని ప్రవేశపెట్టింది. కొత్తవిధానం కింద విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో ఉపకారవేతనాన్ని డిపాజిట్ చేస్తారు.