అంతర్జాతీయం

నిధులిస్తేనే సైనిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 27: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికానే తలమానికం అనే రీతిలో విదేశాంగ విధానం చేపడతానని అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వస్తే అనేక విధాలుగా మార్పులు తీసుకొస్తానని వెల్లడించారు. అసలు చైనా ఇంతగా అభివృద్ధి చెందిందంటే అందుకు అమెరికా నుంచి తరలించిన నిధులే కారణమని ట్రంప్ వెల్లడించారు. అమెరికా మిత్రదేశాలు మరింతగా నిధులు చెల్లించని పక్షంలో జపాన్, దక్షిణ కొరియాల నుంచి తమ దళాలను కూడా వెనక్కి పిలుస్తామని వెల్లడించారు. అలాగే ఐసిస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికా చర్యలకు మద్దతుగా తన దళాలను సౌదీ అరేబియా పంపకపోతే ఆ దేశం నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని కూడా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ట్రంప్ తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన ట్రంప్ ‘నాది ఏకాకి వాదం కాదు’ అని స్పష్టం చేశారు. అయితే అమెరికానే అన్నింటా ముందు నిలవాలన్నదే తన ఉద్దేశమని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు అనేక దేశాలు అమెరికాను అగౌరవ పరిచాయని, అవహేళన చేశాయని పేర్కొన్న ఆయన, తాను అధికారంలోకి వస్తే మొత్తం పరిస్థితినే మార్చేస్తానని వెల్లడించారు. ఎవరూ కూడా అమెరికాకు అతీతంగా మనగలిగే పరిస్థితి ఉండకుండా చేస్తానని, ఆ విధంగా అమెరికాను తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ప్రతి దేశంతోనూ, ప్రతి ఒక్కరితోనూ స్నేహపూరితంగా ఉంటామని, అదే సమయంలో ఎవరూ కూడా అమెరికాను తమ ప్రయోజనాలకోసం వాడుకోకుండా జాగ్రత్తపడతామని తెలిపారు. అమెరికా రుణభారం త్వరలోనే 21 ట్రిలియన్ డాలర్లకు పెరగబోతోందని గుర్తుచేసిన ఆయన, అందుకు కారణం ప్రపంచ రక్షణ బాధ్యతను అమెరికా చేపట్టడమేనని వెల్లడించారు. తరతమ భేదం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి దేశాన్ని అమెరికా ఆదుకున్న విషయాన్ని మరచిపోకూడదన్నారు. చాలా సందర్భాల్లో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే తన సైనిక శక్తితో అనేక దేశాలకు అమెరికా అండగా నిలిచిందని తెలిపారు. చైనాపై తన దృష్టిని మళ్లించిన ట్రంప్ అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కమ్యూనిస్టు దేశం ఎదగడానికి కారణం అమెరికా నుంచి తరలివెళ్లిన నిధులేనని తెలిపారు. అత్యంత వ్యూహాత్మక రీతిలో తమ మారక ద్రవ్య విలువలో మార్పులు తీసుకురావడం ద్వారా చైనా ఈ స్థాయికి చేరుకుందని, కరెన్సీ విలువను ఎప్పుడు తగ్గించాలో, ఎప్పుడు లాభదాయకంగా పరిస్థితిని మార్చుకోవాలో తెలుసుకున్న చైనా ఆ విధంగా రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు.