జాతీయ వార్తలు

కాజీపేట వద్ద తెగిన రైల్వే హైటెన్షన్ వైర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 15: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేట వద్ద రైల్వే హైటెన్షన్ వైర్లు తెగిపోయాయి. కాకినాడ నుండి సికింద్రాబాద్‌కు వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ దర్గా కాజీపేటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా రైల్వే హైటెన్షన్ వైర్లు తెగి కిందపడిపోవడంతో గౌతమి ఎక్స్‌ప్రెస్ ఉన్నఫళంగా ఆగిపోయింది. ఈ సంఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. విషయం తెలియగానే కాజీపేట నుండి నుండి ప్రత్యేక బ్రేక్‌డౌన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపతికన మరమ్మతు చర్యలు చేపట్టారు. వైర్లు తెగిపడిన కారణంగా కాజీపేట - వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య దాదాపు నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనతో ఈ సెక్షన్‌ల మధ్య నడిచే రైళ్ళు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాకతీయ ఫాస్టుప్యాసింజర్, విజయవాడ ప్యాసింజర్, చార్మినార్, నాందేడ్, శాతవాహన, సింగరేణి తదితర రైళ్లు ఆలస్యంగా నడిచాయి. బ్రేక్‌డౌన్ సిబ్బంది దాదాపు నాలుగు గంటల సమయంలో తెగిపోయిన విద్యుత్ వైర్లను మరమ్మతు పనులు చేసి రైళ్ళను పునరుద్ధరించారు.