జాతీయ వార్తలు

భరణం అంశాన్ని చేరిస్తేనే తలాక్ బిల్లుకు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తలాక్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకించడం లేదని, అయితే, భరణం అంశాన్ని కూడా చేరిస్తేనే పూర్తి మద్దతునిస్తామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆమె పీటీఐతో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లులో బాధిత ముస్లిం మహిళలకు భరణం ఇప్పించే అంశం లేదని తెలిపారు. దీనిని కూడా చేరిస్తేనే ట్రిపుల్ తలాక్ కేసుల్లో ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లుద్వారా పరస్పర ప్రయోజనాలను భారతీయ జనతా పార్టీ అశిస్తున్నదని సుస్మిత ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు, భరణం అంశాన్ని తాను లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి తెలియచేసినట్టు ఆమె అన్నారు. అయితే, తన అభ్యర్థనను బీజేపీ సర్కారు బుట్టదాఖలు చేసిందన్నారు. తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోకుండా లోక్‌సభలో బిల్లును కేంద్రం ఆమోదింప చేసుకుందని విమర్శించారు. క్షణాల్లో భార్య నుంచి విడాకులు తీసుకునే వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ విధాన్ని తెరదించేదిగా బిల్లు ఉండాలని సూచించారు. అదే సమయంలో, బాధిత మహిళలకు న్యాయం జరగాలని, అందుకే వారికి భరణం లభించే అంశం బిల్లులో తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లుగా పేర్కొనే వివాహంపై ముస్లిం మహిళల హక్కు చట్టం (2017)కు లోక్‌సభలో ఆమోద ముద్ర లభించింది. కానీ, రాజ్యసభ ఇంకా ఆమోదించకపోవడంతో, చట్టం ఆమల్లోకి రాలేదు.