జాతీయ వార్తలు

బాలురూ అత్యాచార బాధితులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: మైనర్లపై జరుగుతున్న అత్యాచారాల నిరోధక చట్టం ‘పొక్సో‘కు పదును పెట్టి, బాలురపై అత్యాచార సంఘట నల్లోనూ దోషులను మరింత కఠినంగా శిక్షించేలా సవరణలు తీసుకురావాలని మహిళా శిశు సంక్షే మ మంత్రిత్వ శాఖ (డబ్ల్యూసీడీ) పట్టుదలతో ఉంది. బాలురు కూడా అత్యాచార బాధి తులేనని, వారిపై అమానుష చర్యకు ఒడిగట్టివారికి ప్రస్తుతం విధిస్తున్న శిక్ష సరిపోదని స్పష్టం చేస్తున్నది. ఇప్పటికే ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించింది. చట్టంలో మార్పులను సూచిస్తూ కేంద్ర కేబినెట్‌కు త్వరలోనే ఒక ప్రతిపాదనల చిట్టాను సమర్పిస్తున్నది. లింగ వివక్ష లేకుండా, బాలులపై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేయడంతోపాటు, అలాంటి సంఘటనల్లో దోషులను కఠినాతి కఠినంగా శిక్షించేందుకు వీలుగా పొక్సో చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూసీడీ అధికారి ఒకరు తెలిపారు. శిక్ష ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం వివరించలేదు. అయితే, బాలికలా లేక బాలురా అన్న తేడా లేకుండా, 12 ఏళ్ల కంటే చిన్నవారిపై అత్యాచారం చేసిన వారికి మరణ శిక్షను కూడా విధించేలా చట్టాన్ని సవరించాలని డబ్ల్యూసీడీ ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్‌కు ఈ ప్రతిపాదనలను అందచేయనుంది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించారు. చిన్నపిల్లలపై, ప్రత్యేకంగా బాలురపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రముఖ ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త ఇన్సియా దరీవాలా రాసిన లేఖను మేనకా గాంధీ పరిగణలోకి తీసుకున్నారు. తమపై జరిగిన అత్యాచారాలను బాలురు వివిధ కారణాల వల్ల బయటకు చెప్పుకోలేకపోతున్నారని, ముఖ్యం గా ఆ విషయాలను బహిర్గతం చేయడానికి సిగ్గుపడుతున్నారని మేనకా గాంధీకి రాసిన లేఖలో ఇన్సియా పేర్కొంది. అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైన బాలు రు జీవితాంతం ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతారని తెలిపింది. 2007లో డబ్ల్యుసీడీ జరిపిన సర్వేలో వివిధ కుటుంబాలకు చెందిన 12,447 మంది పిల్లలను విచారించింది. ఇళ్లు, పాఠశాలలు లేదా ఇతరత్రా ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారుల్లో 53 శాతం మంది బాలురే కావడం విశేషం. అదే అంశాన్ని ఇన్సియా ప్రస్తావిస్తూ, ఇటీవల కాలంలో అత్యాచారాలు మరింతగా పెరిగాయని తెలిపింది. పొక్సో చట్టాన్ని సవరించి, బాలురపై అత్యాచారానికి ఒడిగట్టిన వారిని కూడా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె చేసిన సూచనలపై స్పందించిన మేనకా గాంధీ పొక్సో చట్టం మార్పులో సవరణలకు సుముఖత వ్యక్తం చేసింది. ఒకటిరెండు రోజుల్లో కేబినెట్ ముందు ప్రతిపాదనల డ్రాఫ్ట్‌ను ఉంచుతుంది.