జాతీయ వార్తలు

రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒప్పందం ఒక స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివాదస్పద రాఫెల్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఒప్పందంలో స్కాం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ స్కీంపై రక్షణ శాఖమంత్రి నిర్మల సీతారామన్ తప్పుల తడకలతో కూడిన ప్రకటన చేశారని ఆయ న అన్నారు. ప్రధాన మోదీ, రక్షణ శాఖమంత్రి నిర్మల సీతారామన్ రాఫె ల్ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుపై తప్పించుకుని తిరిగే ధోరణితోవ్యవహరించారని, సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని అవలంభించారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడే తనకు ఈ ఒప్పందంలో రహస్య క్లాజు ఏదీ లేద ని, ఈ విషయాన్ని బహిర్గతం చేయవచ్చని చెబితే, బీజేపీ రహస్య క్లాజ్ అంటూ హడావుడి చేసిందని రాహు ల్ గాంధీ చేసిన ఆరోపణ లోక్‌సభలో దుమారం రేపింది. కాని రాహుల్ గాంధీ ఈవిషయమై మళ్లీ ఆదివారం చేసిన ట్వీట్‌లో రాఫెల్ కొనుగోళ్ల ఒప్పందంపై ఆరోపణలు చేశారు.