జాతీయ వార్తలు

ప్రపంచమంతా నినదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 27: ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని చేయించాలన్న అంశంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మరో అడుగు ముందుకు వేశారు. ఈ నినాదాన్ని అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన భగవత్ ‘్భరత్ (ఇండియా) అన్నది ఒక భౌగోళిక నామధేయం కలిగిన ప్రాంతమే కాదు, ఇది దేశ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు, ఉన్నత భావనలకు, విలువలకు సమగ్రమైన గుణాత్మకమైన స్వరూపం’ అని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల మార్పులు వచ్చాయని, కాని భారత్‌లో మాత్రం అనాదిగా ఉన్న సంప్రదాయాలే ఎప్పటికప్పుడు శక్తివంతమవుతూ బలపడుతున్నాయని వెల్లడించారు. మిగతా దేశాలన్నీ అభివృద్ధి దిశగానో లేదా పతన దిశగానో పయనిస్తే, భారత్ ఎప్పటికప్పుడు కొత్త విలువలను ప్రోదిచేసుకుంటూ, పాత సంప్రదాయాలకు ఉద్దీపనగా నిలుస్తూ వచ్చిందని భగవత్ స్పష్టం చేశారు. నైతికంగా పతనమవుతున్న దశలో కూడా చాలాచోట్ల ఈ ప్రాచీన సంప్రదాయాలు, విలువలే ఉన్నతంగా నిలుస్తాయని, వాటిని పాటించేవారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉందని తెలిపారు. ‘్భరత్ మాతాకీ జై’ అనే నిదానాన్ని మొత్తం ప్రపంచం అంతా నినదించేలా చేయగలిగితే భారత దేశం అత్యంత సమున్నతమైన సంపత్తి కలిగిన సమానావకాశాలతో కూడిన వివక్షా రహితమైన సేచ్ఛాయుత దేశంగా మరింత ప్రకాశవంతం కాగలుగుతుందని వెల్లడించారు. ఇంత ఉన్నతమైన భారత్ అన్న భావవను ప్రతిఒక్కరూ కూడా తమలో ఇముడ్చుకోవాలని, దానికి అనుగుణంగా తమ జీవనాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ‘్భరత్’ అన్న మాటను ఒక దేశానికున్న పేరుగా పాక్ పేర్కొనడాన్ని ఆయన అవహేళన చేశారు. ‘వేదాలు నేటి పాకిస్తాన్‌లోని నదీ తీరాల్లోనే అంకురించాయి. అక్కడినుంచి మన పూర్వీకులు ప్రపంచమంతా విస్తరించారు. అలాగే సంస్కృత భాషకు మూలకందమైన వ్యాకరణం కూడా అక్కడే ఉద్భవించింది. కాని దేశ విభజన సమయంలో పాకిస్తానీయులు తమ ప్రాంతానికి కొత్తపేరు ఎంచుకున్నారు. భారత్ అన్న పేరును మనకు వదిలేశారు. అందుకు కారణం వారు వ్యతిరేకించిన అన్ని లక్షణాలు, సుగుణాలు భారత్‌కు ఉండడమే’ అని భగవత్ అన్నారు.